NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ లో హైటెన్షన్ .. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జేఏసీ నిరసన

విశాఖలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ పోర్టు వద్ద మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన శ్రేణులు దాడులు చేయడంపై హత్య యత్నంతో సహా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. సీసీ టీవీ పుటేజీ ద్వారా కొందరు జనసేన నేతలను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద అర్ధరాత్రి అరెస్టులు చేసిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. జనసేన నేతల అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. విశాఖ పోలీసుల దురుసు ప్రవర్తన చాలా దురదృష్టకరమని, జనసేన ఎప్పుడూ పోలీసులను గౌరవిస్తుందని పేర్కొన్నారు. జనసేన నేతలను అరెస్టు చేయడం దారుణమని ట్వీట్ చేశారు. డీజీపీ జోక్యం చేసుకుని అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని లేకుంటే తానే పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ నేతలకు సంఘీభావం తెలుపుతామని ప్రకటించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నోవాటెల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు.

Visakha Protest

 

మరో పక్క పవన్ కళ్యాణ్ జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించే విశాఖ పోర్టు కళావాణి స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు, వైసీపీ శ్రేణులు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. గోబ్యాక్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోవాటెల్ హోటల్ వద్ద నుండి కళావాణి స్టేడియం వద్దకు పవన్ కళ్యాణ్ భారీ ఊరేగింపుగా వెళ్లాలని భావిస్తుండగా, పోలీసు అధికారులు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. నేరుగా జనవాణి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించినట్లు తెలుస్తొంది. నోవాటెల్ హోటల్ వద్ద చేరుకుంటున్న జనసేన శ్రేణులను పోలీసులు నిలువరించారు. పవన్ ను అరెస్టు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు తెలిపారు. అయితే జనవాణి కార్యక్రమాన్ని తాము అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర జేఏసి ప్రకటించడంతో విశాఖలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్ర జేఏసి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసు అధికారులు సూచించినట్లు తెలుస్తొంది. అయితే జనవాణి రద్దు చేసే అలోచన లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు సమాచారం. విశాఖలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనవాణిపై సందిగ్ధత కొనసాగుతోంది.

 

Visakha Protest

author avatar
sharma somaraju Content Editor

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N