NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: హైకోర్టు లో ఏపి సర్కార్ కు షాక్ ల మీద షాక్ లు

AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. హైకోర్టు అభ్యంతరం నేపథ్యంలో ప్రజా ప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మరో పక్క మిడ్ లెవల్ హెల్త్ సూపర్ వైజర్ల ( ఎంఎల్ హెచ్ పీ) పోస్టుల భర్తీ ప్రక్రియపై స్టే విధిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖ రుషి కొండ అక్రమ తవ్వకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు డివిజన్ బెెంచ్ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రంలో 1681 హెల్త్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ నిలిపివేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై పిటిషనర్ శివకృష్ణ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ రిట్ అప్పీల్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కు విరుద్దంగా ఆయుష్ వైద్యుల పేర్లను పరిశీలనలోకి తీసుకోకుండా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. జాతీయ ఆరోగ్య విధానం – 2017, ఆయుష్ మాన్ భారత్ కార్యక్రమం నిబంధనలకు విరుద్దంగా ఎంఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందన్నారు. నోటిఫికేషన్ ప్రకారం బీఎస్సీ (నర్సింగ్) ను విద్యార్హతగా పేర్కొన్నారని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. అయితే ప్రభుత్వం తరపున భర్తీకి అవ్వాలని రాబోయే ఎంపికల్లో వారి పేర్లు పరిశీలనకు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా .. మార్గదర్శక సూత్రాలకు విరుద్దంగా ఎలా వ్యవహరిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో మొత్తం ప్రక్రియపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది.

AP High Court

మరో పక్క ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోలన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కోర్టు అనుమతి లేకుండా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ఉప సంహరించుకుంటూ ఇచ్చిన జీవోపై జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం కేసులను ఉపసంహరిస్తొందని పిటిషనర తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ సందర్భంలో గతంలోనే హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా ఉపసంహరిస్తారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజా ప్రతినిధులపై కేసులు ఉపసంహరిస్తూ ఇచ్చిన మొత్తం జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు ధర్మాసనానికి ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం కేసులు కొనసాగించడంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం మూసివేసింది.

అదే విధంగా విశాఖ రుషి కొండ తవ్వకాలపైనా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రుషికొండ తవ్వకాలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఏదో దాస్తొందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని కమిటీ వేస్తే తమరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదులు కేఎస్ మూర్తి, అశ్వనీకుమార్ హైకోర్టుకు తెలియజేస్తూ దానికి సంబంధించి గూగుల్ మ్యాప్ లను కోర్టుకు అందించారు. అయితే తాము 9.88 ఎకరాలకే పరిమితమైయ్యామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి వివరించారు. దీంతో గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. తాను అఫిడవిట్ దాఖలు చేస్తాననీ, అప్పటి వరకూ సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ప్రభుత్వం ఏదో దాస్తున్నట్లు ఉందని హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. మీరు అఫిడవిట్ వేసిన తర్వాత నిజా నిజాలు తెలుస్తామని ధర్మాసనం పేర్కొంటూ.. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

Breaking: వికేంద్రీకరణకు మద్దతుగా యువకుడు ఆత్మహత్యాయత్నం .. చోడవరంలో ఉద్రిక్తత

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N