NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: విశాఖ నోవాటెల్ వద్ద కొనసాగుతున్న టెన్షన్ .. పోలీసు నోటీసులపై న్యాయవాదులతో పవన్ చర్చలు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద టెన్షన్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ చూసి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హోటల్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. విశాఖలో సెక్షన్ 30 అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు నోటీసు జారీ చేయడంతో పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్ కే పరిమితమైయ్యారు. పెద్ద సంఖ్యలో అభిమానులు హోటల్ వద్దకు చేరుకోవడంతో భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నారు. హోటల్ పై నుండి పవన్ కళ్యాణ్ అభిమానులకు అభివాదం చేశారు. మరో పక్క పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చల్లాగాలి కోసం ఆర్కే బీచ్ కు వెళ్లాలని ఉందని, అనుమతి ఉందా అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అదే విధంగా “ఉడతా ఉడతా ఊచ్‌.. ఎక్కడ కెళ్తోవోచ్‌..రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా..మా వైసిపికి ఇస్తావా..మా థానోస్‌ గూట్లో పెడతావా” అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు.

Pawan Kalyan

 

మరో పక్క పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పోలీసులు ఆంక్షలు విధించడంపై ప్రశ్నించారు. ఇదే సమయంలో గతంలో విశాఖలో తనకు జరిగిన అనుభవాన్ని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తొంది. ప్రభుత్వ చర్యలను చంద్రబాబు ఖండించారు. జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. అరెస్టు చేసిన జనసేన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా తమ వైఖరి కొనసాగిస్తే జనసేనతో కలిసి బీజేపీ పోరాటం చేస్తుందని సోము వీర్రాజు తెలిపారు,

Pawan Kalyan

 

పోలీసులు జారీ చేసిన నోటీసులపై జనసేన ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమై పరిస్థితిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అరెస్టు అయిన జనసేన కార్యకర్తలను బయటకు తీసుకువచ్చేందుకు ఆయన న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. అరెస్టు అయిన వారిని బయటకు తీసుకువచ్చిన తర్వాతనే తాను హైదరాబాద్ బయలుదేరి వెళ్లాలని అనుకుంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖ విడిచి వెళ్లే విషయంలో పవన్ కళ్యాణ్ ఏమి తేల్చకపోవడంతో హోటల్ వద్ద బందోబస్తు కొనసాగిస్తున్నారు.

Janasena: పవన్ కళ్యాణ్ కు పోలీసులు షాక్ .. విశాఖ విడిచి వెళ్లాలంటూ నోటీసులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N