NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

వినండి పెద్దల మాట… హై కోర్టు బాట : ఏపీలో కొత్త వింత

 

 

హై కోర్టు మధ్యవర్తిత్వం ఇప్పుడు కొత్తగా మారింది …. నిన్న మొన్నటి వరకు అయితే ప్రభుత్వం పై నిప్పులు చేరగటం… లేకుంటే వాయిదాలు, అభ్యన్తరాలు, అఫడవిట్లతో రమ్మనే కోర్టు బుధవారం రూటు మార్చింది. ఎన్నికల కమిషన్ తో ప్రభ్యత్వం పడుతున్న గొడవలో తానూ మధ్యవర్తిత్వం నెరిపేలా కొన్ని సూచనలు ఇవ్వడం హై లైట్ గ నిలుస్తోంది… అసలేం జరిగింది అంటే…

** స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం , ఎన్నికల కమిషన్ మధ్య పూర్తిస్థాయి విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. కచ్చితంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఎన్నికల కమిషన్ భావిస్తుంటే కరోనా సమయంలో ఎన్నికలు సరికాదని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఎన్నో ఇంకేంన్నో వాదనలు, లేఖలు , వాదోపవాదాలు… ఆఖరికి బూతులు అయిపోయాయి.. ఇప్పుడు దీనిలో తుది తీర్పు ఇచ్చేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్ తో ఒకసారి మాట్లాడాలని … ఒక 5 మంది అధికారుల బృందం వెళ్లి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తో మాట్లాడి రావాలని సూచించింది… దాని తర్వాత ఎం చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వస్తామని చెప్పింది…

రాజి అవుతుందా ??

** ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ పదవీకాలం ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి అవుతుంది. ఈ సమయంలో కచ్చితంగా ఎన్నికలు నిర్వహించి పదవి విరమణ చేయాలనీ నిమ్మగడ్డ భావిస్తున్నారు.. దీనికి ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని విషయాలు ఆయనలో పట్టుదల పెంచాయి. ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. న్యాయపరంగా వెళితే కచ్చితంగా నిమ్మగడ్డ ను ఎదుర్కోవడం తేలికైన పని కాదు.. ఎన్నికల కమిషన్ ఇప్పుడు అనుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించే హక్కు , విధులు కలిగి ఉంది..
** మరో పక్క ప్రభుత్వం లో భాగం అయినా అధికారులు సైతం వెనక్కు తగ్గడానికి ఛాన్స్ లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దీనిపై సీరియస్ గ ఉండటంతో అధికారులు సైతం నిమ్మగడ్డ కు నచ్చ జెప్పేందుకు ప్రయత్నిస్తారు తప్పితే చేసేదేమి లేదు. నిమ్మగడ్డ వెళ్ళిపోయినా తరవాత ఎన్నికలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికి ప్లాన్ వేసింది. కచ్చితంగా ఆయనకు నచ్చజెప్పి ఎలాగో ఎన్నికల వాయిదాకు సహకరించేలా కోరడం తప్ప అధికారులు చేసేది ఏమి ఉండదు. అయితే మరో నెలలో పదవి నుంచి దిగిపోబుతున్న నిమ్మగడ్డ వెనక్కు తగ్గుతారా లేదా … లేక తన మాట ఉంటె పరిస్థితి ఏమిటి అన్నది కోర్టు పరిశీలనలోకి వెళ్తున్నది.
** రెండు అంశాల్లో పట్టు విడుపులు ఉండాలి అంటారు. కోర్టు ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తోంది. రాజ్యాంగం సంక్షోభం వచ్చే విషయాల్లో కోర్టు తమ అపరిమిత అధికారాలు ఉపయోగించి రాజి కి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు మన హైకోర్టు చేస్తున్నది ఇదే అని చెప్పాలి.. ఒక ప్రభుత్వానికి, సర్వ స్వతంత్ర వ్యవస్థకు మధ్య వచ్చే కొన్ని విషయాలను కోర్టు మధ్యవర్తిగా వచ్చి పరిష్కరించే అవకాశం ఉంది. గతం లోను ఎలాంటి విషయాల్లో కోర్టులు చురుగ్గా వ్యవహరించాయి అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

author avatar
Comrade CHE

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju