మరో వివాదంతో చిక్కుకున్న వైసీపీ ఎంపీ ..వైరల్ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్

Share

అనంతపురం జిల్లా హిందూపుర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన నగ్నంగా మాట్లాడుతున్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ పై ఇంతకు ముందు వివాదాస్పద కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో కాల్ వైరల్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో కలకలాన్ని రేపింది.దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక బాధ్యాతయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాధవ్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాధవ్ పై సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్ర, కుతంత్రంతో కొందరు వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడిగా ఎదుగుతున్నందు వల్లే ఓర్వలేక తనపై తప్పుడు వీడియో సెర్క్యులేట్ చేస్తూ అభాసుపాలు చేయాలని చూస్తున్నారన్నారు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమని చెప్పారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు గోరంట్ల మాధవ్. వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఫారెన్సిక్ టెస్ట్ కైనా తాను సిద్దమేనని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట లు దీని వెనుక ఉన్నట్లు మాధవ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పరువునష్టం దావా కూడా వేస్తానని ఎంపీ మాధవ్ తెలిపారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ సంచలన వ్యాఖ్యలు


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

38 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

47 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago