Subscribe for notification

Bhumana Karunakar Reddy: గత ప్రభుత్వ బండారం త్వరలోనే బయటపెడతాం

Share

Bhumana Karunakar Reddy: గత ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తుల ఫోన్ లు ట్యాపింగ్ చేసిందని తమ కమిటీ నమ్ముతుందనీ, దీనిపై పూర్తి స్థాయి విచారణ పూర్తి చేస్తామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ ద్వారా మానవ హక్కులను చోరీ చేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపి శాసనసభా సంఘం (హౌస్ కమిటి) బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సభ్యులు కరణం దర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహనరావు, మద్దాలి గిరిధర్ పాల్గొని ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్దంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారించారు. హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో కమిటీ చర్చించింది.

House Committee Chairman Bhumana Karunakar Reddy comments On Pegasus issue

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసెస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అప్పటి విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్య పరికరాలను వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఏపి ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో భూమన చైర్మన్ గా హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం భేటీ అయిన హౌస్ కమిటీ.. ఈ రోజు హోం, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సంబంధిత సమాచారం కోసం చర్చించింది.

 

సమావేశం అనంతరం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పెగాసస్ వ్యవహారంపై ప్రాధమికంగా చర్చించామని చెప్పారు. ఈ రోజు ప్రాధమిక విచారణ మాత్రమే జరిగిందనీ, వచ్చే సమావేశంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తామన్నారు. పెగాసస్ వ్యవహారంపై త్వరలోనే విషయాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. జూలై 5వ తేదీన మరో సారి కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీనిపై ఆరోపణలు చేశామని కరుణాకర్ రెడ్డి అన్నారు.


Share
somaraju sharma

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

3 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

4 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

4 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

6 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

6 hours ago