NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ప్రక్రియ షురూ చేసిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ ప్రక్రియను ప్రారంభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసును ఏపిలోని కడప నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కడప నుండి కేసుకు సంబంధించి చార్జి షీట్లు ఇతర దస్త్రాలు మొత్తం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు చేరాయి. దీంతో వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ చార్జి షీట్ విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ కేసుకు SC/01.2023 నెంబర్ ను న్యాయస్థానం కేటాయించింది. కేసు విచారణలో భాగంగా వివేకా కేసులో అయిదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు సమన్లు రాజీ అయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీ విచారణకు హజరు కావాలని నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

YS Vivekananda Reddy Murder Case

 

మరో పక్క ఈ కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న కడప ఎంపీ అవనాష్ రెడ్డి ఈ వేళ 3 గంటలకు సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరుకానున్నారు. పులివెందుల నుండి రెండు రోజుల ముందే హైదరాబాద్ కు చేరుకున్న అవినాష్ రెడ్డి.. ఇవేళ ఉదయం లోటస్ పాండ్ కు వెళ్లి వైఎస్ విజయమ్మను కలిశారు. కాగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హజరు అవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పులివెందుల నుండి వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అభిమానులు సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

YS Avinash Reddy

 

ఇవేళ విచారణకు హజరు అవుతున్నట్లు పేర్కొన్న అవినాష్ రెడ్డి సీబీఐ అదికారులకు లిఖిత పూర్వకంగా లేఖ పంపారు. న్యాయవాది సమక్షంలో తమను విచారించాలని, విచారణ ఆడియో వీడియో లో రికార్డు చేయాలనీ, పారదర్శకంగా నిజాయితీగా విచారణ జరగాలని కోరారు. సీబీఐ విచారణకు పూర్తి గా సహకరిస్తానని తెలిపారు. మీడియా, సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేయకుండా సీబీఐ చర్యలు చేపట్టాలని, నిజం నిగ్గు తేలే వరకూ అందరు సంయమనం పాటించాలని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చి దోషులను చట్టపరంగా శిక్షించాలని అవినాష్ రెడ్డి లేఖలో కోరారు.  సీబీఐ అధికారుల ముందు తొలి సారిగా ఎంపీ అవినాష్ రెడ్డి హజరు కానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కుప్పకూలిన మూడు ఫైటర్ జెట్ విమానాలు ..సురక్షితంగా బయటపడిన ఇద్దరు పైలట్లు..ఒకరు మిస్సింగ్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju