ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rayalaseema MP: ఆ రాయలసీమ ఎంపీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు.. మేటర్ ఏమిటంటే..?

Share

Rayalaseema MP: రాయలసీమ ప్రాంత బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు వంద కోట్ల విలువైన ఓ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా టీజీ వెంకటేశ్ తో పాటు ఆయన సోదరుడు కుమారుడు విశ్వప్రసాద్ పైనా హైదరాబాద్ బంజారహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10 లో ఏపి జెమ్స్ అండ్ జ్యూవెలర్స్ పార్క్ కోసం 2005లో అప్పటి ప్రభుత్వం రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో ఇప్పటికే భవన నిర్మాణాలు చేపట్టారు. మరో పక్క ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న మరో అర ఎకరం స్థలాన్ని టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సహా మరి కొందరు ఇటీవల డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు.

Hyderabad Police case Registerd aginest Rayalaseema MP
Hyderabad Police case Registerd aginest Rayalaseema MP

ఈ స్థలం విలువ సుమారు వంద కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కర్నూలు జిల్లా ఆదోని నుండి దాదాపు 90 మంది హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరు అక్కడి సెక్యురిటీ గార్డులపై దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని 63 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు అక్కడ నుండి పరారైయ్యారు. అరెస్టు చేసిన వారి నుండి పోలీసులు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా ఈ వ్యవహారంలో టీజీ వెంకటేశ్, టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ సహా మరో 15 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


Share

Related posts

Intinti Gruhalakshmi: ఇది కదా అసలు పంచ్ అంటే.. తులసికే ఎదురుతిరిగిన అంకిత.. ఈ చిచ్చుకు లాస్య ఆజ్యం పోసిందా..!?

bharani jella

అంతర్వేది ఘటన సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీచేసిన ప్రభుత్వం

Special Bureau

Amaravathi: రాజధాని కన్ఫ్యూజన్..! ఏపిలో ఆర్బీఐ కార్యాలయం ఎక్కడంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar