Subscribe for notification

రామ‌తీర్థం ఘ‌ట‌న‌ దోషులు దొరికిపోయారా?

Share

రామతీర్థం కోదండ రామాల‌యం…. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ పుణ్య‌క్షేత్రం కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు జిల్లా వాసుల‌కు , ఇరుగుపొరుగు జిల్లాల వారికే సుప‌రిచితం. అయితే, కోదండ రాముని విగ్రహం ద్వంసం ఘటనతో ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కింది. మ‌రోవైపు రోజురోజుకి రాజకీయ రంగు పులుముకుంటోంది. అయితే, ఈ ఘ‌ట‌న‌పై తాజాగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

జ‌గ‌న్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

రామ‌తీర్థం ఘ‌ట‌న‌పై వివాదాలు చెల‌రేగుతుండ‌టంతో ప్ర‌భుత్వం ప‌క్కాగా విచార‌ణ చేస్తోంది. ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటలిజెన్స్‌ , సిఐడి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించి .. అనుమానం ఉన్న ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ముప్పై మందికి పైగా అనుమానితులను విచారిస్తున్నారు. సెల్ టవర్ సిగ్నల్ ఆదారంగా ఘటన జరిగిన రోజు ఆ ప్రాంతంలో సంచరించిన వారిని దర్యాప్తు బృందాలు విచారిస్తున్నాయి .

వాళ్లే చేశారా?

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటలిజెన్స్‌ , సిఐడి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించిన‌ ప్రభుత్వం ప్ర‌తి అంశాన్ని ప‌క్కాగా విశ్లేషిస్తోంది. స్థానికుల ప్ర‌మేయం లేకుండా ఘటన జరగదనే అనుమానం పోలీసులు ఉన్న‌తాధికారులు వ్యక్తం చేయడంతో స్థానిక నేతలను సైతం విచారిస్తున్నారు. నలుగురు కీలక అనుమానితిలను సైతం విచారిస్తున్నారు. రామతీర్ధం ఘటనలో విచారణ కోసం మాజీ సర్పంచ్ భర్త కోటపాటి తిరుపతిరావుని విచారణకు పిలిచి ఆయన వేలి ముద్రలను తీసుకున్నారు. దేవాలయంలో పనిచేస్తూ, కొంతకాలంగా విధులకు గైర్హాజరు అయిన ఉద్యోగిని సైతం విచారణ చేశారు. గతంలో దేవాలయాలులో దొంగతనాలు చేసే నిందితులను సైతం విచారణ కు దర్యాప్తు అధికారులు పిలుస్తున్నారు.

ఆ ఒక్క పార్టీనే టార్గెట్ చేశారా?

అయితే , రామ‌తీర్థం ఘ‌ట‌న‌లో దోషుల‌ను తేల్చేందుకు ఒక్క పార్టీకి చెందిన వ్యక్తులనే టార్గేట్ చేసి విచారణ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందిస్తూ విచారణ నిస్పక్షపాతంగా జరుపుతున్నామని వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ ప్రాథమిక ఆధారాలు సేకరించామని . సాంకేతిక ఆదారాలు సైతం సేకరిస్తున్నామన్నారు. నిందితుల్నిత్వరలో పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేసారు .. ప్రజలంతా సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు. మరోవైపు జిల్లాలో శాంతి భ‌ద్రతల సమస్య తలెత్తకుండా సర్వమత పెద్దలతో కలిపి ప్రత్యేక కమిటీలను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. రామతీర్దం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30 ని అమలు చేస్తున్న పోలీసులు ఘటన జరిగిన బోడికోండ పైకి ఎవరినీ అనుమతించడం లేదు.


Share
sridhar

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

3 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

3 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

4 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

5 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

6 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

7 hours ago