NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: తెలంగాణ‌కు గుడ్ న్యూస్ … క‌రోనా స‌మ‌యంలో రెమ్డిసివిర్‌, ఆక్సిజ‌న్ భారీ స‌ర‌ఫ‌రా

Corona: దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న క‌రోనా క‌ల‌క‌లం తెలంగాణ‌లోనూ త‌న ఉధృతిని సాగిస్తోంది. కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ చికిత్స విష‌యంలో కావాల్సిన ఆరోగ్య సంబంధ‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఈ స‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణకు రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు ప్రస్తుతం రోజూ ఇస్తున్న 5,500 రెమ్డిసివిర్ ఇంజక్షన్ల సంఖ్యను సోమవారం నుంచి 10,500కు పెంచుతున్నట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.

 

ఎక్క‌డి నుంచంటే…

చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒడిశాలోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫోన్ చేసి చెప్పారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ ను కోరారు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాగా, కేంద్రం ఆదేశాల‌తో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంబంధిత అధికారుల‌తో చర్చ‌లు జ‌రిపింది. ఈ మేర‌కు రాబోయే ఒక‌ట్రెండు రోజుల్లో తొలిద‌శ ఆక్సిజ‌న్ కాన్సంటేట‌ర్లు అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Corruption Killing India: Corona Business
Corruption Killing India Corona Business

ఇదీ ప‌రిస్థితి..

కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,816 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. మరో 27 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 5,892 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55 శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.80శాతంగా ఉంది. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 44,985 టెస్టులు చేయగా.. ప్రస్తుతం 50,969 యాక్టివ్ కేసులున్నాయి. కాగా జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

author avatar
sridhar

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!