NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

తెలంగాణ ప్ర‌జలు పార్లమెంటు ఎన్నిక‌ల్లో ఒక ఆస‌క్తిక‌రంగా స‌న్నివేశం చూడ‌బోతున్నారు. ఇప్పుడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిదిలోని నాలుగు పార్లమెంటు స్థానాల్లో ప్ర‌జ‌లు మెజారిటీ సీట్ల‌ను క‌ట్టబెడుతారో అనే ఆస‌క్తి తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉంది. ఎందుకంటే గ్రేట‌ర్ ప‌రిధిలో నాలుగు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, చేవేళ్ళ, మ‌ల్కాజ్‌గిరి స్థానాలు ఉన్నాయి. గ్రేట‌ర్ ప్ర‌జ‌లు ఎలాంటి వారంటే అన్ని రాజ‌కీయ పార్టీలు మాకు స‌మాన‌మే అని చూస్తుంటారు. భాగ్య‌న‌గ‌రంలో ప్ర‌జ‌లంతా క‌లిసిమెలిసి ఉండాల‌ని, అందుకు అన్ని రాజ‌కీయ పార్టీలు మ‌న‌వేన‌ని భావిస్తూ గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను స‌మానంగా చూసారు.

హైద‌రాబాద్‌కు బాద్‌షాగా గుర్తింపు ఉన్న ప‌తంగి పార్టీ అయిన ఏఐఎంఐఎం నుంచి అస‌ద్దుద్దీన్ ఓవైసీని గెలిపించారు. ఇక్క‌డ ప‌తంగి పార్టీకి ఎప్పుడు తిరుగులేదు. ఇక చేవేళ్ళ ప్ర‌జ‌లు కారుపై క‌నిక‌రం చూపించారు. బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన రంజిత్‌రెడ్డిని గెలిపించారు. ఇక మ‌ల్కాజ్‌గిరి నుంచి ఇప్ప‌టి సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు తమ హ‌స్త‌వాని మంచిద‌ని రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే.. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌లు ఏకంగా రేవంత్‌రెడ్డిని సీఎం ను చేశారు. ఇక సికింద్రాబాద్ నుంచి ప్ర‌స్తుత కేంద్ర‌మంత్రి జి.కిష‌న్‌రెడ్డిని బీజేపీ నుంచి గెలిపించారు. ఇక్క‌డ క‌మ‌లం విక‌సించింది.

ఇలా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు నాలుగు పార్టీల నుంచి ఎంపీలుగా గెలిపించి త‌మ ఉధార‌త‌ను చాటుకున్నారు. ఎవ్వ‌రు మాకు ఎక్కువ కాదు.. మాకు ఎవ్వ‌రు త‌క్కువ కాదు.. మాకు అన్ని రాజ‌కీయ పార్టీలు స‌మాన‌మే అని ఇంత‌కాలం అన్ని పార్టీల‌ను స‌మానంగా అక్కున చేర్చుకున్న గ్రేట‌ర్ ప్ర‌జ‌లు ఇప్పుడు జ‌రుగ‌బోతున్న ఎన్నిక‌ల్లో ఎలాంటి తీర్పు ఇవ్వ‌బోతున్నారో అనే ఉత్కంఠ తెలంగాణ ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. ఈ ఎన్నిక‌ల్లో ముగ్గురు ఎంపీలు త‌మ స్థానాల నుంచి మ‌రోసారి పోటీ చేస్తుండ‌గా, ఒక స్థానంలో మాత్రం కొత్త అభ్య‌ర్థికి అవ‌కాశం ద‌క్కింది.

ఇక ఇందులో చేవేళ్ళ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీచేస్తున్న రంజిత్‌రెడ్డి బీ ఆర్ ఎస్ నుంచి గెలిచి, ఇప్పుడు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఉన్నారు. పార్టీ మారిన ఇక్క‌డ ఆయ‌న పాత‌నేత‌నే. ఇక హైద‌రాబాద్ నుంచి ఒవైసీ, సికింద్రాబాద్ నుంచి కిష‌న్‌రెడ్డిలు ఇద్ద‌రు పాత‌వారే.. అదే పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మ‌ల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం కావ‌డంతో కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ప‌ట్నం సునితా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో భాగ్య‌న‌గ‌ర ప్ర‌జ‌లు ఎవ్వ‌రి ఆద‌రిస్తారో.. ఎవ్వ‌రిని చీద‌రిస్తారో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను అక్క‌న చేర్చుకుంటారో.. లేక మార్పు కు శ్రీ‌కారం చుడుతారో వేచిచూడాల్సిందే.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?