NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Incom Tax: ఇలా చేస్తే చాలు..పన్ను ఆదా చేసుకోవచ్చు..!

Incom Tax: చాలా మందికి ఆదాయపు పన్ను కట్టడం చాలా భారంగా ఉంటుంది. పన్ను ఆదా చేసుకోవడానికి నానా రకాల మార్గాలను అన్వేషి,స్తూ ఉంటారు. పన్ను విషయంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటి కోసం ట్యాక్స్ కన్సల్ టెంట్ లను, సీఎలను ఆశ్రయిస్తూ సలహాలను తీసుకుంటుంటారు. పన్ను ఆదా చేయాలని భావిస్తున్న వారు ఆదాయపు పన్ను చట్టం 80 సి కింద పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు చెబుతుంటారు. వేతన జీవులు ఇలా పెట్టుబడి పెడుతూ ఉంటారు.

Incom Tax saving
Incom Tax saving

Incom Tax: 2021 -21 ఆర్థిక సంవత్సరంలో పన్నులను ఎలా ఆదా చేసుకోవాలంటే

సెక్షన్ 800 సీసీడీ (1బీ) కింద అదనపు పన్ను ఆదా…ప్రతి ఏటా పన్ను చెల్లింపుదారులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పి ఎస్) లో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80 సి కింద రూ.లక్షన్నర వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే సెక్షన్ 80 సిసిడి (1 బి) కింద ఎన్ పి ఎస్ చందాదారులకు రూ.50వేల అదనపు తగ్గింపు ఉంటుందని చాలా మందికి తెలియదనీ, ఎన్ పి ఎస్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించిన రూ.50వేల అదనపు మినహాయింపు ఈ పరిమితి రూ.లక్షన్నరకు మించి ఉందని చెప్తున్నారు. 30 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వారు ఎన్ పి ఎస్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వారి పన్ను మొత్తాన్ని రూ.15,600ల వరకూ తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

ఆరోగ్య భీమా ప్రీిమియం (80 డి) …ప్రస్తుత పరిస్థితిలో ఆరోగ్య భీమా అన్నది ఒక ఎంపిక మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ అవసరం కూడా. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారీగా పెరిగాయి. ఆరోగ్య బీమా సౌకర్యం లేకపోతే అత్యవసర ఆరోగ్య సమస్యలు ఎదురైతే ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఫీజు చెల్లింపునకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ భీమా చెల్లిస్తే వారు పన్ను చెల్లింపు చేసుకోవచ్చు. పాలసీదారుడు హెల్త్ కవర్ కోసం చెల్లించిన ప్రీమియం మొత్తానికి కూడా సెక్షన్ 80 డీ కింద పన్ను ప్రయోజనాలను క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పన్ను చెల్లింపు దారుడి కుటుంబ పరిస్థితి ప్రకారం తగ్గింపు పరిమితి రూ.25,000లు, రూ.50,000లు, రూ.75,000, లేదా రూ.1,00,000గా ఉండవచ్చు.

సెక్షన్ 80 డీడీ కింద ప్రయోజనాలు ..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డీడీ కింద ఒక మదింపుదారుడు భారతదేశంలో నివసించే వ్యక్తి లేదా హిందూ కుటుంబం అయి ఉంటే వైద్య చికిత్స, శస్త్ర చికిత్స కోసం ఏదైనా ఖర్చు చేస్తే వారి డిపెండెంట్ పునరావాసంతో పాటుగా అంగవైకల్యం ఉన్న వ్యక్తి అయితే పన్ను మినహాయింపు పొందవచ్చు. ఎల్ఐసీ లేదా మరేదైనా భీమా సంస్థ తరపున రూపొందిన పథకం కింద మదింపుదారుడు ఏదైనా మొత్తాన్ని చెల్లించినా లేదా జమ చేసినా పన్ను మినహాయింపు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎడ్యుకేషన్ లోన్ సెక్షన్ 80 ఇ కింద రుణం తీసుకుంటే కూడా ప్రయోజనలు ఉంటాయి. మీ తండ్రి మీ చదువుల కోసం రుణం తీసుకుంటే వడ్డీ చెల్లింపునకు పన్ను ప్రయోజనం ఆయన పొందవచ్చు. అదే విధంగా రుణం మీ పేరు మీద ఉంటే మీ తండ్రి తన పన్ను పరిధిలోకి వచ్చే అదాయం నుండి వడ్డీని చెల్లించినప్పటికీ చెల్లించిన వడ్డీ పై పన్ను ప్రయోజనం పొందలేరు. మీరు ఇద్దరూ మీ పన్ను పరిధిలోకి వచ్చే అదాయం నుండి రుణం తిరిగి చెల్లించనట్లయితే మీ తండ్రి కూడా పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అన్ని ఎడ్యుకేషన్ లోన్ లకు ఇలాంటి అవకాశం ఉండదు. పన్నుల విభాగం నోటిఫై చేసిన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణాలు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. సెక్షన్ 80 సి కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ఈ సదుపాయం ఉంటుంది.

సేవింగ్ బ్యాంకు వడ్డీపై (80 టీటీఎ, 80 టిటిబి) ..చాలా మంది తమ డబ్బులను సేవింగ్ ఖాతాలో జమచేసి వడ్డీ తీసుకుంటారు. అయితే ఆ వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు కానీ పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80 టిటిఎ కింద తగ్గింపులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్ లు సెక్షన్ 80 టిటిబి కింద మినహాయింపు పొందవచ్చు. గరిష్ట తగ్గింపు పరిమితి పది వేలు నుండి 50వేల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్ 80 జి మరియు సెక్షన్ 80 జిజి… పలు సామాజిక సేవా అంశాల మీద నూరు శాతం ఈ సెక్షన్ కింద మినహాయింపు ఇవ్వబడుతుంది. మీ విరాళాలపై 50 శాతం తగ్గింపునకు అర్హత ఉన్న మార్గాలు కొన్ని ఉన్నాయి. సెక్షన్ 80 జిజి కింద మీరు అద్దె చెల్లించినప్పటికీ ఇంటి అద్దె కోసం ప్రత్యేకంగా భత్యం పొందకపోతే మీరు ఈ విభాగం కింద మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80 యు ..శరీరక వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి రూ.75,000 తగ్గింపును పొందవచ్చు. తీవ్రమైన వైకల్యం ఉంటే ఇది రూ.1.25 లక్షల వరకూ పొందవచ్చు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!