IT Rides: తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను శాఖ (ఐటీ) సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఇవేళ ఉదయం నుండే సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ అయిన కళామందిర్ దుకాణాలు, యాజమాన్య నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు జరుపుతున్నది. ఆదాయపన్ను భారీగా ఎగవేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తొంది.

హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఏకకాలంలో 20 ప్రదేశాల్లో వివిధ బృందాలుగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖకు చెందిన పలు వ్యాపారుల ఇళ్లలోనూ ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యాపారులు వారు నిర్వహిస్తున్న వ్యాపారానికి సంబంధించి అందుకు అనుగుణంగా ఆదాయపన్ను చెల్లించకుండా పెద్ద ఎత్తున పన్ను ఎగవేశారన్న సమాచారంపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. సోదాల అనంతరం ఐటీ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్