NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గోవా వెళ్లే ఏపి పర్యాటకులకు గుడ్ న్యూస్ .. ఇక ప్రయాణ సమయం రెండు గంటలే

Share

గోవా వెళ్లి సరదాగా సేద తీరాలనుకునే ఏపి వాసులకు ఇండిగో ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపి నుండి చాలా మంది గోవాకు వెళ్లి వస్తుంటారు. అయితే ప్రస్తుతం గన్నవరం, విశాఖ నుండి నేరుగా గోవాకు విమాన సర్వీసులు లేకపోవడంతో చాలా సమయం పడుతోంది. ప్రస్తుతం గోవా వెళ్లే పర్యాటకులు విశాఖ లేదా గన్నవరం లో విమానం ఎక్కి హైదరాబాద్ లేదా బెంగళూరులో మరో విమానంలోకి మారి గోవాకు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల ఇంటర్ కనెక్ట్ ఫ్లైట్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తొంది. రెండు గంటల విమాన ప్రయాణానికి మూడు గంటల నుండి పది గంటల వరకూ సమయం పడుతోంది. దూరం తక్కువే అయినా నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం తప్పట్లేదు.

indigo airlines to Tourists For Goa Trip

 

అయితే తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ చేసిన ప్రకటన పర్యాటకుల్లో సంతోషాన్ని నింపుతోంది. విశాఖ నుండి గోవాకు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది ఇండిగో ఎయిర్ లైన్స్. ఈ నెలాఖరు నుండి సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రెండు గంటల్లోపు గోవాకు పర్యాటకులు చేరుకోవచ్చని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28 నుండి సర్వీసులు ప్రారంభిస్తామనీ, వారంలో మూడు రోజులు నేరుగా గోవాకు విమానాలు ఉంటాయని తెలిపింది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నార్త్ గోవా విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 3.40 గంటలకు ఫ్లైట్ బయలు దేరుతుందని, సాయంత్రం 5.35 గంటలకు విశాఖకు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధి తెలిపారు. తిరిగి విశాఖ నుండి రాత్రి 7 గంటలకు బయలుదేరి రాత్రి 8.50 గంటలకు గోవాకు చేరుకుంటుందని తెలిపారు.

ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ తలవంచదు అంటూ కీలక వ్యాఖ్యలు

 


Share

Related posts

కిడ్నాప్ స్కెచ్ పక్కాగా వేసిన ఇంజినీరింగ్ డ్రాపౌట్ స్టూడెంట్!వెలుగులోకి వస్తున్న మతిపోయే విషయాలు!!

Yandamuri

మైత్రీ మూవీస్ – ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ మూవీ.. త్వరలో అనౌన్స్ మెంట్ ..?

GRK

Bigg Boss: బిగ్ బాస్ ఫ్యామిలీ టైం.. మొదట, రెండు ఫ్యామిలీలా వివరాలు..!!

sekhar