NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Infosys: ఏపి ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. విశాఖకు దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్

Infosys: ఏపిలో భారీ క్యాంపస్ ఏర్పాటునకు దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్పోసిస్ సంసిగ్దత వ్యక్తం చేసింది. తాము వైజాగ్ వస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఇన్ఫోసిస్. ప్రారంభంలో 1000 సీటింగ్ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఇన్ఫోసిస్.. రానున్న కాలంలో మరింతగా విస్తరించి 3000 వేల సీట్లకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంది. విశాఖలో క్యాంపస్ ఏర్పాటునకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థ గ్లోబల్ ఇన్‌ఫాస్ట్రక్చర్ హెడ్ నీలాద్రిప్రసాద్ మిశ్రా, రీజనల్ హెడ్ ఆమెల్ కులకర్ణి రీసెంట్ గా ఏపి పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ తో భేటీ అయి చర్చించారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ కోసం ప్లగ్ అండ్ ప్లే విధానానికి మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Infosys Huge campus set in Visakha
Infosys Huge campus set in Visakha

 

విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సొంత భవనాన్ని సమకూర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని ప్రతినిధులు వెల్లడించారు. ఐటి రాజధానిగా విశాఖ ఎదగడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయనీ, ఇన్ఫోసిస్ రాకతో మరిన్ని దిగ్గజ కంపెనీలు తరలివస్తాయని మంత్రి గుడివాడ అమరనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మధురవాడ సమీపంలో ఇప్పటికే ఆదానీ గ్రూపు రూ.14,500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. దీని నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ చిన్న ఐటీ కంపెనీలకే పరిమితమైన విశాఖ లో ఇన్ఫోసిస్ రాకతో ఐటీ హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

ఏపికి చెందిన ఐటీ నిరుద్యోగులు ఇప్పటి వరకూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. విశాఖ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందితే ఏపికి చెందిన ఐటీ నిరుద్యోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడుతుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?