NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan Vs Ambati Rambau: ఒకప్పుడు అవి బడిలో మాస్టారు తిట్లు .. ఇప్పుడు రాజకీయ నేతలు..! చూడండి ఎలానో..?

Pawan Kalyan Vs Ambati Rambau:  ఒకప్పుడు బడిలో పంతులు (మాస్టారు) సరిగా చదవని విద్యార్ధులను వెధవ అని లేదా గాడిద, అడ్డ గాడిద అంటూ తిట్టేవాళ్లు, విద్యార్ధులు ఒకరి నొకరు పొట్లాడుకునే సమయంలో పంది, దున్నపోతు అంటూ పశువుల పేర్లతో తిట్టుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఆ భాష రాజకీయ నేతలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం లో విద్యాబోధన జరుగుతుండటంతో సరిగా చదవని, సక్రమంగా తరగతులకు రాని విద్యార్ధులను, మంచి మార్కులు రాని వారిని బ్లడీ ఫూల్, ఈడియట్ అంటూ ఇంగ్లీషులో తిడుతున్నారు. అయితే పాత కాలం నాటి పశువుల తిట్లను ఇప్పుడు రాజకీయ నేతలు ఉపయోగిస్తుండటం జరుగుతోంది.

Pawan Kalyan Vs Ambati Rambau

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

గతంలో రాజకీయ నేతలు ప్రత్యర్ధి నాయకులపై విమర్శలను హుందాగా చేస్తుండేవారు. వారు అదే రీతిలో ప్రతి విమర్శలు చేస్తుండే వారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు మీడియాలో రాయలేని భాషలో దుర్భాషలు, బూతులతో ప్రత్యర్ధులను తిట్టే పరిస్థితులు కొనసాగుతున్నాయి. మీడియాలో కూడా గతంలో రాయలేని దూషణలను ఇప్పుడు రాస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీలో తనను విమర్శించే నాయకులను ఉద్దేశించి ఆ గాడిదలు ఓండ్రిస్తున్నాయి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. గతంలో రాజకీయ నాయకులు ఒక వేళ పరుష పదజాలంతో ఏవరినైనా విమర్శిస్తే ప్రత్యర్ధి నాయకుడు హుందాగా ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నాను అంటూ కూడా ఆ వివాదాన్ని అక్కడితో నిలుపుదల చేసే వాళ్లు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీలోని కొందరు నాయకులను గాడిదలుగా పోలుస్తూ విమర్శిస్తే మంత్రి అంబటి రాంబాబు అదే రీతిలో ప్రతి విమర్శలు చేశారు. వరాహం అని పెద్ద అడ్డ గాడిద అంటూ అంబటి రాంబాబు కౌంటర్ కామెంట్స్ చేశారు. ప్రత్యర్ధులను ఈ రకంగా తిట్లతో దూషణలు చేస్తే ఆ పార్టీ నాయకులు, అభిమానులు చప్పట్లు కొట్టి సంతోషిస్తారేమో కానీ సాధారణ ప్రజానీకం మాత్రం ఇదేమి భాషరో బాబో అని అనుకుంటారు. ఇంతకు ముందు రాజకీయ నాయకుల మధ్య బూతుల పంచాంగం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యర్ధులను బూతులతో తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. దీంతో ప్రత్యర్ధులు కూడా తామేమి తక్కువ తిన్నామా మాకు బూతులు వచ్చు అంటూ అదే రీతిలో కౌంటర్ అటాక్ లు ఇస్తున్నారు. కానీ ఇటువంటివి ఎంకరేజ్ చేయడం మంచిది కాదని రాజకీయ నేతలు తెలుసుకుంటే మంచిది.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్ ఇది

author avatar
sharma somaraju Content Editor

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!