ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ లో రేవ్ పార్టీ సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి పలువురుని అదుపులోకి తీసుకున్నారు. పది మంది యువకులు, ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు పార్టీ పేరుతో గంజాయి వినియోగిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధులు ఈ పార్టీ ఏర్పాటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ పార్టీపై దాడి చేసిన పోలీసులు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తొంది. బర్తే డే పేరుతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.

ఇటీవల కాలంగా నగరాల్లో రేవ్ పార్టీ కల్చర్ కొనసాగుతోంది. విద్యార్ధుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు మాదకద్రవ్యాలు అలవాటు చేస్తుండటంతో వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. విద్యార్ధులు సరదాగా చేసుకునే పార్టీలో గంజాయి లభిస్తుండటం ఆందోళన కల్గిస్తొంది. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నా అక్కడక్కడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే జరిగే రేవ్ పార్టీలు కొండపల్లి ప్రాంతంలో నిర్వహిస్తుండటం ఆందోళన కల్గిస్తొంది.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా మరో మారు రాజధానిపై స్పష్టత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్