24.2 C
Hyderabad
December 9, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP: ఆ 18 సీట్లు తమ్ముల్లే ఓడిస్తారు..టీడీపీకి షాక్: బాబులో బెంగ, భయం..!

Share

TDP: రాష్ట్రంలో తెలుగుదేశం (టీడీపీ) పార్టీ అనేక కష్టాల్లో ఉంది. పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే భవిష్యత్తు ఊహించుకోవడమే కష్టం. అంత గందరగోళంలో ఉంటూ కూడా.. ఆ పార్టీ అభ్యర్ధుల ఎంపిక విషయంలోనే ఇంకా చంద్రబాబు ఒక ఫైనల్ నిర్ణయాలకు రాలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు కాబట్టి వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు నుండే అభ్యర్ధులను ఫైనల్ చేసుకుని జనంలోకి వెళ్లి కార్యకర్తలను కలుసుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకువెళుతున్న స్టేజీలో ఉండాలి. కానీ ఇప్పటికి కూడా చాలా నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను నియమించలేక, చాలా నియోజకవర్గాల్లో విభేదాలను పరిష్కరించలేక, చాలా నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసుకోలేక, బలం ఉన్న చోట కూడా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోలేకపోతున్నది. పైగా కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి.

internal group politics in TDP

TDP: ఇన్ చార్జి ప్రకటనకే సత్తెనపల్లిలో…

ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీలో ఏమి జరిగిందో అందరూ చూశారు. ఈ నియోజకవర్గంలో ముగ్గురు నేతలు ఇన్ చార్జిలుగా టికెట్లు ఆశిస్తున్నారు. ముగ్గురులో ఒకరు పోటీ నుండి తప్పుకున్నా మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివరామ్ లు మాత్రం గత కొంత కాలంగా ఇన్ చార్జి కోసం ఆశపడుతున్నారు. వీళ్ల వర్గాలు తమ నేతకే ఇన్ చార్జి ఇస్తారంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. పార్టీ అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు వీళ్ల ఇద్దరికీ టికెట్ ఇవ్వరు, మూడవ వ్యక్తికి టికెట్ ఇస్తారు అని తెలుస్తొంది. ఇన్ చార్జిని ప్రకటించండి.. ఇన్ చార్జిని ప్రకటించండి అంటూ కొట్టుకున్నారు. ఇన్ చార్జి ప్రకటనకే కొట్టుకున్నారు అంటే ఇన్ చార్జి ఇచ్చిన తర్వాత వాళ్లకు ఇన్ చార్జి ఇవ్వడం ఏమిటని అని కూడా కొట్టుకుంటారు కదా..! ఇది సత్తెనపల్లి నియోజకవర్గ పరిస్థితి.

 

TDP: నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు

అలానే ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పార్టీ పరంగా నియోజకవర్గంలో బలంగా ఉన్నప్పటికీ రెండు వర్గాలు ఉన్నాయి. హనుమంతయ్య చౌదరి, ఉమామహేశ్వర నాయుడు లు ఇన్ చార్జి కోసం పట్టుబడుతున్నారు. వీళ్లద్దరికి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. ఇలాంటి పరిస్థితులే చాలా నియోజకవర్గాల్లో ఉంది. దాదాపు 18 నుండి 20 నియోజకవర్గాల్లో వాళ్లల్లో వాళ్ల గ్రూపుల కారణంగా వాళ్లంతట వాళ్లే పార్టీని ఓడించే పరిస్థితి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ. ఇక్కడ కూడా రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. అక్కడ ఇన్ చార్జిగా ఇంటూరి నాగేశ్వరరావుకు ఇచ్చిన తర్వాత ఆయన గ్రౌండ్ వర్క్ పరంగా, ప్రజల్లో వెళ్లే విషయంలో తిరుగు లేకుండా బాగా పని చేస్తున్నారు. కానీ ఆయన కంటే ముందే జనంలోకి వెళ్లి, ఆయన కంటే ముందే కార్యకర్తల్లోకి వెళ్లి, ఆయన కంటే ముందుగానే పార్టీ కోసం పని చేసిన ఇంటూరి రాజేష్ ను నాగేశ్వరరావు విస్మరిస్తున్నారు. వీళ్లద్దరి వైరం కారణంగా నియోజకవర్గంలో పార్టీ గందరగోళంలోకి వెళ్లిపోతోంది. నాగేశ్వరరావు కంటే రాజేశ్ కే అక్కడ సానుభూతి(సింపతీ) పరంగా కానీ, కొన్ని విషయాల్లో సానుకూలతలు ఉన్నాయి. ఇద్దరి విషయంలోనూ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక క్లారిటీకి రాలేకపోవడంతో పార్టీకి నష్టం జరిగే పరిస్థితి నెలకొని ఉంది.

 

ఇదే కోవలో ఉమ్మడి కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గం ఉంది. మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డి, ప్రస్తుత ఇన్ చార్జి ఉక్కు ప్రవీణ్ రెడ్డి ఉండగా వీద్దరినీ కాదని కొత్త నాయకుడిని తీసుకువస్తున్నారనే ప్రయత్నం జరుగుతోంది. అలానే మైదుకూరు నియోజకవర్గం ఉంది. ఇక్కడ రెడ్డి సామాజికవర్గ నేతకు టికెట్ ఇస్తారా లేక సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇస్తారా అనే దానిపై స్పష్టత లేదు. సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇస్తే టీడీపీ లోని రెడ్డి సామాజికవర్గం సహకరించని పరిస్థితి. అదే విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో ఇన్ చార్జిగా సుబ్బారెడ్డి ఉన్నప్పటికీ అక్కడ కేఇ వర్గం కాస్త బలంగానే ఉంది. అలానే కోట్ల వర్గం కూడా ఒక మండలంలో బలంగా ఉంది. వాళ్లద్దరికంటే తానే బలవంతుడిని అని ధర్మవరం సుబ్బారెడ్డి పని చేస్తున్న కారణంగా  గ్రూపులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఇలా చూస్తే కృష్ణాజిల్లా పరిధిలోని పామర్రు రిజర్వుడ్ నియోజకవర్గం. ఇక్కడ వేరే నాయకుల పెత్తనం ఉంది. అభ్యర్ది గెలిస్తే తమ పెత్తనం సాగదని ఓడించే పరిస్థితి ఉంది.

 

అలానే ఉమ్మడి కడప జిల్లా లోని రైల్వే కోడూరులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే తమ పెత్తనం కొనసాగదని పార్టీలోని వాళ్లే ఓడిస్తుంటారు. అదే విధంగా తిరువూరు. తాజాగా గోపాలపురం నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఇన్ చార్జిగా మద్దిపాటి వెంకటపతిరాజుకు ఇచ్చారు. ఆయన అంత సమర్ధుడు కాదని స్థానిక నేతలు అంటున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు లేక వెంకటపతిరాజులో ఎవరికి టికెట్ అనేదానిపై క్లారిటీ లేకపోవడంతో ఆయా వర్గాలు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నాటకీయ, కమర్షియల్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరు పోటీ చేస్తారు అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఇక్కడ కూడా ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు పార్టీకి వ్యతిరేకంగా మారే పరిస్థితి. అలానే అనకాపల్లి, ఉదయగిరి, కావలి, దర్శి, నగిరి తదితర నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీ వాళ్లే ఓడించే పరిస్థితులు ఉన్నాయి.

Chandrababu: బాబుకు చేరిన ప్రముఖ పత్రిక సర్వే..! టీడీపీకి ఎన్ని సీట్లు..? లిస్ట్..!

 


Share

Related posts

బీజేపీ నేత ఎత్తుగడ కి కంగారు పడుతున్న తండ్రీకొడుకులు..??

sekhar

హద్దులు దాటిన “స్వామి భక్తి”! చిత్తూరు జిల్లా లో విచిత్రం!!

Yandamuri

ఏపీలో ప్రభుత్వం వర్సెస్ హైకోర్టు..! వివాదాలకు అంతెప్పుడు?

Muraliak