IPS ABV: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. మ్యాటర్ ఏమిటంటే..?

Share

IPS ABV: సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) మరో సారి హైకోర్టు (AP High Court) ను ఆశ్రయించారు. ఇంటెలిజెన్స్ డీజీగా పని చేసిన సమయంలో భద్రతా పరిరకాల కొనుగోలు వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏబీవీ. పరికరాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసింది లేదు. ఒక్క పైసా ఎవరికీ చెల్లించింది లేదు, విజిలెన్స్ కమిషన్ ఆమోదం ఆమోదం పొందకుండానే సాధారణ విచారణ జరిపి 2021 మార్చి నెలలో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు.

IPS AB Venkateswara Rao filed petition high court against acb case

తప్పుడు ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని ఏసీబీ పిటిషన్ లో కోరారు. ఈ వ్యాజ్యంలో తుది నిర్ణయం వెల్లడించే వరకూ ఎఫ్ఐఆర్ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలను నిలువరించేందుకు మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. భద్రత పరికరాల కొనుగోలు నిర్ణయంలో తన పాత్ర లేదని పేర్కొంటూనే తన వల్ల ఎలాంటి ఆర్దిక నష్టం జరగలేదన్నారు. అక్రమాలు జరగనప్పుడు, ఆర్ధిక నష్టం వాటిల్లనప్పుడూ ఏసీబీ చట్టం కింద కేసు చెల్లుబాటు కాదని ఆయన తెలిపారు. మోసం చేసినట్లుగా గానీ, తన వల్ల ఒక్కరయినా మోసానికి గురైనట్లు ఆరోపణలు లేనందు వల్ల ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చెల్లదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా పోలీసులు తనపై కక్ష సాధింపు కొసం వత్తిళ్లకు తలొగ్గి కేసు నమోదు చేశారని ఏబీవీ పేర్కొన్నారు.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

38 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

41 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago