NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS ABV Letter To AP CS: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక లేఖ..

IPS ABV Letter To AP CS: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ అంశంపై ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మకు లేఖ రాశారు. తనను ఇంకా సస్పెన్షన్ లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. రెండేళ్లు పూర్తి అయినందున సస్పెన్షన్ తొలగిపోయినట్లేనని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సస్పెన్షన్ ఆరేసి నెలల చొప్పున పొడిగింపు జనవరి 27తో ముగిసిందని, రెండేళ్లకు మించి సస్పెన్షన్ కు కేంద్ర హోంశాఖ అనుమతి తప్పని సరి అని లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.  గడువులోపు కేంద్ర హోంశాఖ నుండి అనుమతి తీసుకోనందున అది ముగిసినట్లేనని అన్నారు. సస్పెన్షన్ తొలగిపోయినందున సర్వీస్ రూల్స్ ప్రకారం తనకు పూర్తి జీతం ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో కోరారు.

IPS ABV Letter To AP CS:
IPS ABV Letter To AP CS

 

ఏబీ వెంకటేశ్వరరావు గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పని చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తరువాత ఆయనపై  ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. అయితే దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించడంతో అరెస్టు నుండి మినహాయింపు లభించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై గతంలో వైసీపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు. తొలుత ఆయన సస్పెన్షన్ పై హైకోర్టును ఆశ్రయించగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత కోర్టులో సవాల్ చేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju