NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Janasena : తిరుపతిలో నెగ్గుకు రావడం అంత సులభమా?

Janasena : ఇటీవల సోషల్ మీడియాలో జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా ఓ ప్రచారాన్ని చేస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సీటు అంశంలో నెలకొన్న ప్రతిష్టంభన వీడి పోయిందని, తిరుపతి సీటును బిజెపి జనసేన కు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అన్నది ఆ ప్రచారం సారాంశం. పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి బీజేపీ నేతలు ఈ స్వీట్ ను జనసేనకు ఇచ్చేందుకు అంగీకరించారు అన్నది ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం… ఈ ప్రచారం మాట అటుంచితే అసలు తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలం ఎంత? పవన్ మేనియా పనిచేస్తుందా? అసలు నేత్ర స్థాయి పరిస్థితిని ఏమాత్రం అంచనా వేయకుండా ఎవరికి తోచినట్లు వారు లెక్కలు వేసుకుని సీట్ కోసం కీచులాడుకోవడం చూస్తుంటే జాలితో కూడిన నవ్వు రాక మానదు. ఎందుకంటే బిజెపి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అంత తేలికగా జనసేన పార్టీ కి ఇచ్చే అవకాశం లేదు అన్నది ఢిల్లీ వర్గాల మాట.

ఒకవేళ ఇస్తే బీజేపీ సహకరిస్తుందా?

తిరుపతి సీటును జనసేన పార్టీ కనుక బిజెపి ఇస్తే ఆ పార్టీ జాతీయ నాయకులు దీని మీద పెద్దగా దృష్టి సారించారు. రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే ప్రచారంలో పాల్గొనేందుకు జనసేన పార్టీతో కలిసి ఎన్నికల క్యాంపెయిన్ చేసేందుకు రావచ్చు. ఇది జనసేన పార్టీ కు ఏమాత్రం ఉపయోగపడదు సరికదా ఇంక తీవ్ర స్థాయిలో క్షేత్రస్థాయి పరిస్థితులు మారిపోవచ్చు.
1.  జనసేన పార్టీ తిరుపతి లోక్సభ పరిధిలో పోటీ చేస్తే ప్రచారం మొత్తం పవన్ భుజాన వేసుకుని ముందుకు నడిపించాలి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన వన్ మ్యాన్ షో చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుంది అన్నది చూడాలి. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం నాయకులు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఎలా ముందుకు వెళుతుంది అన్నది కూడా కీలకమే. అందులోనూ పవన్ కళ్యాణ్ ని చూసి ఓట్లు వేసే అవకాశం లేదనే చెప్పాలి.
2.  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాత్రమే జనసేనకు వెన్ను దన్నుగా ఉండే కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో బలిజల ఓట్లు చాలా తక్కువ. సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నవి. ఇక్కడ దళిత ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి కు మద్దతుగానే దళితులు ఓటు బ్యాంకింగ్ కనిపిస్తుంది. మరి దీనిని తమ వైపు మళ్లించేందుకు జనసేన పార్టీ ప్రత్యేక వ్యూహం ఏమిటి అన్నది అసలు అర్థం కావడం లేదు. అందులోనూ తిరుపతి లోక్సభ పరిధిలో ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే పరిస్థితి ఉంది. మరి క్షేత్రస్థాయిలో ఎస్సీలను సమ్మిలితం చేసే నాయకుడెవరు జనసేన పార్టీ కు లేరు అన్నది బహిరంగ రహస్యం.
3.  జనసేన పార్టీ కు ఒకవేళ టికెట్ కేటాయిస్తే అసలు అభ్యర్థి ఎవరు అన్న దాని మీద స్పష్టత లేదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన పేరు కూడా ఏదీ లేదు. అప్పటికప్పుడు ఎవరో నాయకున్ని ఎంచుకొని పార్టీ అభ్యర్థిగా నిలబడితే దానిని జనసేన కార్యకర్తలు ఒప్పుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే అసలు జనం ఆ సదరు అభ్యర్థి మీద నమ్మకం ఎలా పెంచుకుంటారు అన్నది కీలకమే. ఇప్పటి వరకు రకరకాల పేర్లు వచ్చినప్పటికీ జనసేన పార్టీ కి టికెట్ ఇస్తే కనుక కచ్చితంగా ఈ నాయకుడు పోటీలో ఉంటాడు అన్న మాట ఇప్పటివరకు లేదు.
4.  ఇక ఆర్థిక బలానికి వస్తే జనసేన పార్టీ టికెట్ ను కేటాయించిన సుమారు ఎన్నికల ఖర్చు ఐదు నుంచి పది కోట్ల వరకూ సులభంగా అవుతుంది. మరి అంతటి ఖర్చును ఉపఎన్నికల్లో పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? పార్టీ టికెట్ ను తీసుకొని దానికి తగిన న్యాయం ఎలా చేస్తారు అన్నది కూడా చూడాలి. ఆర్థికంగా పార్టీ సహాయం చేస్తుందా లేక వ్యక్తిగతంగానే ఎంపీ బరిలో వుండే వ్యక్తి మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకోవాల అన్నది కూడా చూసుకుని మాత్రమే టికెట్ను తీసుకునేందుకు ముందుకు వస్తారు. బిజెపి లాంటి పార్టీ అయితే సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చే పార్టీ ఫండ్ తో కాస్త నెట్టు వచ్చే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ పూర్తిగా ప్రాంతీయ పార్టీ కావడంతోపాటు ఆర్థిక వనరులు అంతంతమాత్రంగా ఉండటంతో కేవలం పవన్ మేనియా ను నమ్ముకుని బరిలోకి దిగాలి. ఒకవేళ గెలిచినా, ఓడినా పెద్దగా వచ్చే ప్రయోజనం ఉండదు.
5.  బిజెపి జనసేన నాయకుల మధ్య సఖ్యత అంతగా లేదు. పవన్ సాయి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త వరకూ ఇరు పార్టీల నేతలకు ఎక్కడ అంత పొందుక కనిపించడం లేదు. ఏ కార్యక్రమం కలిసి చేసిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఇరు పార్టీల నేతలు కలిసి ఎంత మేరకు పనిచేస్తారు? తిరుపతిలో ఎవరికీ సీటు దక్కిన మిగిలిన పార్టీ నేతలు కార్యకర్తలు దానికి సహకరిస్తారా లేదా అనేది అంతుబట్టని ప్రశ్న.

అమిత్ షా తేల్చే అవకాశం!

మార్చి 4, 5 తేదీల్లో తిరుపతికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి ఉప ఎన్నిక మీద ప్రధానంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి చేరుకుంటారు. బిజెపి రాష్ట్ర నాయకులు ఇటు జనసేన పార్టీ నాయకులతో ఆయన సమావేశమై తిరుపతి ఉప ఎన్నిక సీటు ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నది ఆ సమావేశంలో తేలి చేయవచ్చు. ఒకవేళ అమిత్ షా కనుక కచ్చితంగా తిరుపతి సీటు విషయంలో కావాలని అడిగితే జనసేనాని సైతం ఏమీ మాట్లాడడానికి ఉండదు. ప్రచారం మాత్రం ఏదో ఒకటి చేసుకుని janasena పార్టీ బయట పడటం తప్ప వేరే మార్గం ఉండదు.

author avatar
Comrade CHE

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju

మంత్రివ‌ర్యా.. సాటి మ‌హిళా నేత‌పై యాంటీ ప్ర‌చారం ఎందుకు… మీ గెలుపుపై న‌మ్మ‌కం లేదా..!

మొత్తంగా టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ ఇలా శుభం కార్డు వేసేశాయ్‌…!