NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏమిటి ? గార”డి”… ఈ తాత్కాలిక పట్టాలేలా జగన్ ??

ఇంటిపట్టాల పంపిణిలో కొత్త విషయం ఇది… ఎంతో విలువైన స్థలాలు పేదలకు ఇస్తున్నమని దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వలేని భారీ ఎత్తున పట్టాలు ఇస్తున్నామని చెప్పిన జగన్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తుందా..? లేక తిమ్మిని బమ్మి చేస్తుందా? మరి ఇంకేదైనా ఉందా..? రహస్య అజెండా అమలులో భాగమా? అబ్బో ఇంటి పట్టాల తంతులో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు ఇప్పుడు ప్రభుత్వ నిజాయతీని ప్రశ్నిస్తున్నాయి… జగన్ చేస్తున్న వింత విషయాన్నీ బయటకు తీస్తున్నాయి…. అదేమిటంటే…

** జగన్ ఇంటి పట్టాల కార్యక్రమంలో జగన్ ఇచ్చిన ఆయన చిత్రంతో ఉన్న పట్టాను ఒకసారి గమనించండి… అది పక్క డి ఫామ్ పట్టా. అంటే తాత్కాలిక పట్టా. అంటే ఆ స్థలం మీద పేదలకు ఎలాంటి హక్కు ఉండదు… అన్న మాట. దీనికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే దానిపై హక్కు వస్తుంది… అరే మరి ఇదేంటి ఎలాంటి పట్టాలు ఇచ్చారు అని అడిగితే మాత్రం జగన్ ప్రభుత్వ పెద్దలు, అధికలురు ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే….. కోర్టు కేసులున్నాయి… అని…
** రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సేకరించిన అన్ని స్థలల మీద కోర్టు కేసులు లేవు అన్నది గుర్తించాలి. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 10 శాతం స్థలాలపై కేసులు… వివిధ లీగల్ అడ్డంకులు, స్టే లు ఉన్న మాట వాస్తవమే… వాటిని ఎవరు వేయించారు.. కోర్టుల వరకు ఎవరు వెళ్లారు.. ఎందుకు ఏమా కథ అనే దానిలోకి వెళ్తే పెద్ద విషయం. దానిలోకి వెళ్లకుండా చూస్తే … ప్రభుత్వం చెప్పినట్లే 10 శాతం స్థలాల కు సంబంధించి మాత్రమే.. వివాదం ఉన్న చోట మాత్రమే డి ఫామ్ పట్టా ఇవ్వాలి. మిగిలిన చోట సీఎం చెప్పినట్టు రిజిస్టేషన్ పట్టా ఇవ్వాలి. ఇది సహేతుకం… కానీ జరుగుతున్నది వేరు కదా…
** ఇళ్ళ స్థలాల కోసం పట్టాలు పంపిణీని ప్రతిపక్ష పార్టీలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు అని చెబుతూ ప్రభత్వం వచ్చింది.. పలు థఫాలుగా వాయిదాలు వేసింది. కోర్టులలో కేసులు కావాలని వేశారు అని చెప్పారు. అయితే చివరకు కేవలం 10 శాతం భూముల మీదనే కేసులు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది.. దానిలో కూడా వాస్తవంగా చూస్తే కేవలం 4% భూములు పైన మాత్రమే కేసులున్నట్లు తెలుస్తోంది.


** క్రిస్మస్ రోజున ముహూర్తం పెట్టి వరుసగా 15 రోజులు పాటు 30,75,000 పట్టాల పంపకం అంటూ చెప్పి మొదటిగా 20,00,000 ఇళ్ళ పట్టాలు, తరువాత వాటిని క్రమేణా 25,00,000 చేసి, చివరకు 30,00,000 అంటూ ఇప్పుడు 30,75,000 చేసారు. అయితే అన్ని చోట్ల అధికారులు చెప్పే మాట
ఈ విషయం కోర్టు పరిథిలో ఉన్నందున డి.ఫారం పట్టా మాత్రమే ఇస్తామని, రిజస్ట్రేషన్ కోర్టు తీర్పు తరువాత ఇస్తామని చెబుతున్నారు.
** ఇవి ఉత్తుత్తి పట్టాలే అని తెలుస్తోంది. వీటిని తరువాత వచ్చే ప్రభుత్వం అంగీకరించక పోతే, నష్టపోయేది ఎవరు ..? అప్పుడు వచ్చే ప్రభుత్వాలు వీటిని అనుమతించేది లేదని చెబితే ప్రజల్లో వచ్చే వ్యతిరేకలతకు ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది ప్రశ్న.
** ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన విషయం ఏమిటంటే, కేవలం 10% భూములు మాత్రమే కోర్టులో వివాదం ఉన్నదని. అంటే షుమారుగా 3,07,500 పట్టాలు వివాదంలో ఉన్నాయి. వాటి వరకు డి.ఫారం ఇచ్చి, మిగిలిన మొత్తం ఇళ్ళకు సరైన పట్టాలతో రిజిస్ట్రేషన్ చేయవచ్చు కదా? ఏవరు అడ్డం పడుతున్నారు? ఏందుకు ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పటం లేదు?
దీనిలో తర్వాత ఏమైనా తేడాలు వచ్చిన… వచ్చే ప్రభుత్వాలు కొర్రీలు పెట్టిన నష్టపోయేది పేదోడు….

రాజకీయాలలోకి ప్రభుత్వ పట్టాల పంపిణి తీసుకువెళ్తే… తర్వాత వచ్చే చిక్కులు , నష్టాలను ఎవరు భరించాలి.. ? ఎందుకు ఈ ముసుగులో పట్టాల పంపిణి ఆట అన్నది ప్రభుత్వమే చెప్పాలి… రిజిస్ట్రేషన్ కు రాష్ట్రవ్యాప్తంగా అడ్డంకులు ఏవి లేవని ఏమైనా లీగల్ ఇబ్బందులు వస్తే దానికి సమాధానం చెప్పేది ఎవరు???

author avatar
Comrade CHE

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!