KCR: కేసీఆర్ ను కాపీ కొడుతున్న జ‌గ‌న్‌.. ఫ‌లితం ఉంటుందా?

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కాపీ కొడుతున్నారా? క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో ఏపీ సీఎం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవ‌లే ఇంటింటి సర్వే చేసింది. ఇదే బాట‌లో ఏపీ ప్రభుత్వం కూడా స‌ర్వేకు సిద్దమైంది. ఎందుకంటే, ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతీ రోజు 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త కేసుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది.

YS Jagan: Jagan Trollers Failed New Scheme
YS Jagan: Jagan Trollers Failed New Scheme

 

ఏపీలో ఇదీ ప‌రిస్థితి…

కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరంతో బాధపడుతూ అనేక మంది ఇంట్లోనే ఉంటూ కుటుంబ స‌భ్యులకు వైరస్‌ వ్యాపించేందుకు కారణమవుతున్నారు. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. కరోనా వచ్చిన వారు ఐసోలేషన్లో వుండకుండా.. నిబంధనలను బేఖాతరు చేస్తూ తిరగడం వల్లనే కొత్తగా మ్యూటెంట్ అయిన కరోనా వేగంగా విస్తరిస్తోందని ప్రభుత్వం భావించింది. దీంతో ప్రతి ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో కరోనా నియంత్రణకు ఇంటింటా కొవిడ్ ఫీవర్‌ సర్వే చేస్తున్నారు.

స‌ర్వేలో ఏం చేస్తున్నారు?

ప్రతి ఒక్కరూ ఫీవర్‌ సర్వేకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ సర్వేలో భాగంగా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి జ్వరపీడితులను గుర్తిస్తారు. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలుంటే ఆ విషయాన్ని సంబంధిత ఏన్‌ఎన్‌ఎంకు తెలియజేస్తారు. వారికి కేటాయించిన 50 ఇళ్లకు వెళ్లి ఆ సర్వే చేస్తారు. సర్వే బృందాల పని తీరును తనతో పాటు జిల్లా యంత్రాంగం మానిటరింగ్ చేస్తుంది. అంతేకాకుండా వివరాలను ఎప్పటికప్పుడు వలంటీర్ల యాప్‌లోనూ అప్‌లోడ్‌ చేస్తారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని అవసరాన్ని బట్టి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో గానీ, ఆస్పత్రిలో గానీ చేర్పిస్తారు. కరోనా లక్షణాలేవీ లేని వారిని, ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారిని, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారిని 14 రోజుల వరకు హోం క్వారంటైన్‌లో ఉంచుతారు. వారికి అవసరమైన మందుల కిట్‌ ఇచ్చి ఏఎన్‌ఎం ద్వారా పర్యవేక్షణ చేస్తారు. దీనివల్ల కరోనాను కట్టడి చేయడమే కాక, ఆస్పత్రులపై ఒత్తడి కూడా తగ్గనుంది. మ‌రోవైపు ఇంటింటి స‌ర్వేపై రాష్ట్ర అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నారు.


Share

Related posts

ఆంధ్రప్రదేశ్ లో దుబ్బాక రిపీట్ చేయాలని ఏపీ బీజేపీ భారీ స్కెచ్..!!

sekhar

బిగ్ బాస్ 4 : అఖిల్ నోరు జారాడు…! ఇక ఇంటి బయటికే…?

arun kanna

AP Special Status : బాబూ.., జగనూ.., మోడీ.. వెంకయ్య..! ఆ మాటకే “ప్రత్యేక హోదా”..!!

Srinivas Manem