NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Vizag Steel : వంతులు.. ఇంతులు.. జింక్ గురుతులు!

Vizag Steel : పోరాడితే పోయేదేమీ లేదు... ఉక్కు సంకెళ్లు తప్ప!! ఇది అసలు కథ

Vizag Steel : రాజకీయ పార్టీల వంతులు, ఢిల్లీ మాటలు, ఒకరిపై ఒకరు వేసుకునే నిందలు తప్ప Vizag Steel వైజాగ్ స్టీల్ పరిశ్రమ కాపాడుకోవడం మీద రాజకీయ పార్టీలో స్పష్టత కొరవడుతోంది. అసలు ప్రజా ఉద్యమాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి కేంద్రం ఎలా ఒప్పించాలి అన్న అంశం మీద ఇప్పటి వరకు ఓ నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. కేంద్ర సంస్థలను ప్రైవేటీకరణ చేసే విషయంలో, పెట్టుబడులు ఉపసంహరించే విషయంలో కేంద్రం నిర్దిష్టమైన దారిలో ముందుకు వెళ్తోంది.

ఈ సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ బేటీ కరణ విషయంలో కేవలం లేఖల ద్వారా వినతి పత్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని భావించడం ఓ భ్రమ. అయితే ఇప్పటి వరకూ రాష్ట్ర నాయకులు అంతా లేఖలు, వినతిపత్రాలు మీదనే ఉన్నారు తప్ప విశాఖ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉమ్మడి పోరాటాన్ని తీసుకొకపోవడం శోచనీయం.

 is not planing for protest to vizag steel
is not planing for protest to vizag steel

Vizag Steel గాజువాక ఎం అవుతుందో?

గాజువాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ధనిక నియోజకవర్గం గా పిలుస్తారు. ఎక్కడ తలసరి ఆదాయం నాలుగు లక్షల పైమాటే. దీనికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో ఉన్న పన్నెండు వందల చిన్న మధ్యతరహా భారీ పరిశ్రమల ద్వారా ఇక్కడ కార్మికులకు అందుతున్న ఉద్యోగాలు జరుగుతున్న వ్యాపారాలే కారణం. దీనిలో ప్రధానంగా 70 శాతం స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా పనిచేసేవే.

ఇప్పుడు కేంద్రం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపడంతో ఈ కార్మికుల ఉద్యోగాలు ఏమౌతాయో ఉపాధి ఎటు వెళుతుందో అన్న భయం పట్టుకుంది. ఒకవేళ పరిశ్రమ ప్రైవేటీకరణ అయితే వీరి వేతనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థంకాని పరిస్థితి. వీరికి అనుసంధానంగా ఉన్న వ్యాపారాలు ఇతర అంశాలపైన ఈ ప్రభావం పడుతుంది. ఈ నియోజకవర్గం మొత్తం ప్రభావితం అవుతుంది అనడంలో సందేహం లేదు.

జింక్ పాటలు ఎం నేర్పాయి…

స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ వాటాను అమ్మేందుకు గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నింటిలోనూ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని బలంగా ఉంది. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగులకు భరోసా ఉండదు. అలాగే వేతనాలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది తెలియదు. ఒకవేళ ప్రైవేటీకరణ అయితే ఏమవుతుంది అనడానికి గతంలో విశాఖలోనే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేటీకరణ ఫలాలను నిపుణులు చెబుతున్నారు చూపిస్తున్నారు.

చేదు గుర్తులు ఇంకా ఉన్నాయి!

విశాఖలో 1974లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఈ కర్మాగారం కోసం పాత గాజువాక, మింది, నక్కల వాని పాలెం, మునగాడా ప్రాంతాల రైతుల నుంచి సుమారు 350 ఎకరాలను అప్పట్లో సేకరించారు. ఎకరానికి 1000 రూపాయల లోపే పరిహారం ఇచ్చారని పూర్వికులు చెబితే తెలుస్తోంది. నిర్వాసితులు లో చాలామందికి జింక్ పరిశ్రమ లో ఉద్యోగాలు దొరికాయి. దాదాపు మూడు పల్లెల్లో జనం అందరికీ పరిశ్రమలో మంచి ఉద్యోగాలు వచ్చాయి. అయితే 2002 సంవత్సరంలో జింక్ పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తున్నారన్న వార్త వచ్చే సమయానికి ఉద్యమం ఏమీ లేదు. దానిపై ఎవరికీ సరైన అవగాహన లేకపోవడంతో పాటు ఏమీ కాదు అన్న భావనతో కార్మికులు ఎవరు దానిని అప్పట్లో అంతగా వ్యతిరేకించలేదు. అయితే ప్రైవేటీకరణ వైపు వేగంగా వెళ్లిన కేంద్ర ప్రభుత్వం 2004లో అకస్మాత్తుగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

అప్పట్లో పరిశ్రమకు రెండు వేల ఒక వంద ఉద్యోగులతో పాటు మూడు వేల వరకు రోజువారి కూలీలు పరిశ్రమకు పని చేస్తుండేవారు. ఉద్యోగుల తగ్గింపులో భాగంగా వీఆర్ఎస్ ను అమలు చేస్తూ మరోవైపు కూలీలకు క్రమంగా పని తగ్గించడం మొదలు పెట్టారు. ఏడాది కాలంలో ఒత్తిళ్ళు వివిధ కారణాల రీత్యా 1800 మంది ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకోగా, అసలు కూలీలు కనిపించడమే మానేసారు. దీంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకం లేకుండా నేను చక్కగా పని జరిగిపోయింది. పరిశ్రమలోని 70 శాతం వాటాను వేదాంత గ్రూపుకు అమ్మేశారు. దీంతో మిగిలిన ఉద్యోగులను సైతం గ్రూపు బలవంతపు వీఆర్ఎస్ లను ఇచ్చింది.

తీవ్రంగా నష్టపోయి…

అందరితో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసినప్పటికీ కాస్త అవగాహన ఉన్న 300 మంది ఉద్యోగులు మాత్రం కంపెనీకి ఎదురుతిరిగారు. తాము స్వచ్ఛంద పదవీ విరమణ చేయమని తేల్చి చెప్పడంతో పాటు ఐక్యంగా పోరాటాలు చేసే వారు. అయితే యూనియన్ నాయకులను అధికారులను ప్రైవేట్ సంస్థ యాజమాన్యం రంగ తీసుకోవడంతో ఉద్యోగుల మీద వారు ఒత్తిడి తీసుకు రావడం మొదలుపెట్టారు. రకరకాల ప్రలోభాలతో మిగిలిన వారిని మెల్లమెల్లగా విఆర్ఎస్ తీసుకునేందుకు ఒప్పించడం మొదలుపెట్టారు.

దీంతో 2013 సంవత్సరం నాటికి జింక్ పరిశ్రమ లో ఉద్యోగులు లేరు పూర్తిగా కంపెనీ సైతం మూతపడింది. అయితే కంపెనీ భూములు మాత్రం వేదాంత గ్రూపు చేతిలోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ భూములతో వేదాంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది అని స్థానికులు చెబుతున్నారు. ఒక్క ఎకరం సుమారు ఎనిమిది కోట్లు పలుకుతోందని మొత్తం 300 ఎకరాలను ఆ సంస్థ తీసుకోవడం ద్వారా ఎంతో లబ్ధి పొందిందని మాజీ ఐఏఎస్ అధికారులు సైతం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం విశేషం.

ఇదే గతి రేపు Vizag steel కు…

గతంలో జింక్ పరిశ్రమ మూతబడిన అనుభవాలను ఇప్పుడు వైజాగ్ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో అంతా పట్టించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఇప్పుడు చెబుతున్నట్లు భూములు ఇవ్వమని అంటున్నా.. ప్రైవేటు సంస్థలు మాత్రం దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవని ఖచ్చితంగా భూములను పొందేందుకే ప్రైవేట్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ కు సుమారు 20 వేల ఎకరాలకు పైగా భూములు ఉండడంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం పరిశ్రమను పొందేందుకు ముందుకు రావచ్చని.. ఈ భూభాగాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమంగా మరల్చి రాష్ట్ర ఆత్మగౌరవ నినాదం గా ముందుకు తీసుకెళ్తాం ఏ ప్రయోజనం ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. మరి రాజకీయ పార్టీలు తీరు ఎలా ఉంటుంది అంతా కలిసి దీనిని ఏమైనా ఆపు కలుగుతాయా అన్నది కాలమే నిర్ణయించాలి.

author avatar
Comrade CHE

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju