NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ కెరీరే డేంజ‌ర్లో ప‌డిందా..?

మాజీ మంత్రి పోనుబోయిన అనిల్ కుమార్ చుట్టూ విమ‌ర్శ‌లు ముసురుకున్నాయి. ఆయ‌న రాజ‌కీయాల్లో పైర్ బ్రాండ్ అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో నెల్లూరులో ఉన్న‌ప్పుడు జిల్లా మొత్తాన్నీ శాసించాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నించారు. కొన్నాళ్లు ఆ ప‌నిచేసినా.. త‌ర్వాత మాత్రం ఆయ‌న హ‌వా సాగ‌లేదు. ఫ‌లితంగా ఆయ‌న కంటే కూడా వైసీపీ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. నాయ‌కులు చాలా మంది పార్టీ నుంచి జంప్ చేశారు. అంతేకాదు.. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింత ఎక్కువ‌గా ఇబ్బంది పెట్టింది.

ఇక‌, ఇప్పుడు నెల్లూరు నుంచి ఆయ‌న‌ను ప‌ల్నాడుకు షిప్ట్ చేసినా.. ఆయ‌న తీరు మాత్రం ఏమాత్రం మార‌లేద‌న్న‌ది వైసీపీ నాయ‌కుల్లోనే జ‌రుగుతున్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌. ప్ర‌స్తుతం న‌ర‌సరావు పేట నుంచి ఎంపీగా అనిల్ కుమార్ యాద‌వ్ బ‌రిలో ఉన్నారు. అయితే.. ఆయ‌న చేసిన ప్ర‌సంగాల్లో ఇచ్చిన పిలుపులో తెలియ‌దు కానీ.. ప‌ల్నాడు జిల్లాలోని కీల‌క‌మైన ప్రాంతాల్లో మాత్రం ర‌ణ‌రంగంగా మారిపోయింది. ప‌రిస్థితిని అదుపు చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని పోలీసులు చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి క‌నిపించింది.

అయితే.. నెల్లూరులో స్వ‌ప‌క్షంలో విప‌క్షంగా మెలిగిన అనిల్.. ప‌ల్నాడు ప్రాంతానికి వ‌చ్చేస‌రికి మాత్రం.. టీడీపీపై ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో పోలింగ్ ప్రారంభ‌మైన నాటి నుంచి న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. తాజాగా అవి దాడుల వ‌ర‌కు కూడా రావ‌డంతో అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం అనిలేనంటూ.. వైసీపీలోని ఓవ‌ర్గం ఫిర్యాదులు చేయ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం. ఎందుకంటే.. గ‌తంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో అయితే వివాదాలు చోటుచేసుకోలేదు.

కానీ, తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌నే కొట్ట‌డం.. రక్తాలు కార‌డం వంటివి తీవ్ర వివాదంగా మారాయి. ఈ ప‌రిణామాల‌కు తోడు అనిల్ చేస్తున్న వ్యాఖ్య‌లు.. ఎదురు దాడి వంటివి రాజ‌కీయంగా కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ప‌ల్నాడులోని మాచ‌ర్ల‌, గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా అనిల్ ప్రోద్బ‌లంతోనే ఈ దాడులు జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ నాయ‌కులు సైతం ఆరోపిస్తుండ‌డంతో ఆయ‌న ఉనికి ప్ర‌మాదక‌ర‌మా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. అనిల్ చేసిన వ్యాఖ్య‌లు.. ఇక్క‌డ ప్ర‌భావం చూపించాయ‌నేది స్థానికంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?