jagan CBI Case: జగన్ అక్రమాస్తుల కేసు ..! హెటిరోకు హైకోర్టు షాక్..!!

Share

jagan CBI Case: జగన్ అక్రమాస్తుల కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హెటిరో డ్రగ్స్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేసింది. అయితే ఇదే క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారు పలువురు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లు దాఖలు చేశారు.  కేసులు త్వరితగతిన పరిష్కరించే క్రమంలో భాగంగా జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు దాఖలు చేసుకున్న క్వార్ పిటిషన్ లపై తెలంగాణ హైకోర్టు రోజు వారి విచారణ జరుపుతోంది. హెటిరో కేసులో హైకోర్టు తీర్పును వెల్లడించింది.

jagan CBI Case: హెటిరో క్వాష్ పిటిషన్ కొట్టివేత

జగన్ సంస్థల్లో హెటిరో సంస్థ, దాని డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పెట్టుబడులు పెట్టారన్న అంశంపై సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారణ జరిపి తీర్పును వెల్లడించింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వ్యాపార వ్యూహాల్లో భాగమేననీ, ఈ సంస్థకు వైఎస్ హయాంలో చేసిన భూకేటాయింపుల్లో అక్రమాలు జరగలేదని హెటిరో తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మరో పక్క సీబీఐ తమ వాదనలను వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం హెటిరో తరుపు న్యాయవాది వాదనలకు ఏకీభవించలేదు.  హెటిరో శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన వేర్వేరు క్వాష్ పిటిషన్లను తోసిపుచ్చింది.

jagan CBI Case: మేటర్ ఏమిటంటే…

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల లో అరబిందో, హెటిరో సంస్థలకు వైఎస్ఆర్ ప్రభుత్వం భూకేటాయింపులను కేటాయించింది. జగన్ కు చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిపక్షంగా భూకేటాయింపులు జరిగాయని సీబీఐ   తెలియజేస్తూ..సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జి షీటు కూడా దాఖలు చేసింది. అయితే ఈ కేసులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లు దాఖలు చేశారు. ఇదే క్రమంలో మిగతా క్వాష్ పిటిషన్ లపై కూడా త్వరితగతిన తీర్పులు ఇచ్చేందుకు హైకోర్టు ప్రయత్నిస్తోంది.


Share

Related posts

December: మీరు డిసెంబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

Kumar

మంత్రిపై రెబల్ ఎంపి ఘాటు వ్యాఖ్యలు..!!

Special Bureau

పార్టీలో లోకేష్ పరిస్థితి చూసి బయట వినబడుతున్న డైలాగ్..??

sekhar