NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా క్యూ లైన్ లలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఎన్నడు లేని విధంగా ఏపీలో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచి పెట్టనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీ ని వదిలి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు కోర్టు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చింది. మంగళవారం రోజున సీఎం జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టులో ఊరట లభించింది. విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది సిబిఐ కోర్టు. ఈనెల 17వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు లండన్ వెళ్లడానికి జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది కోర్ట్.

దీంతో తన కుటుంబ సమేతంగా లండన్‌కు వెళ్ళనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సిబిఐ కోర్టు అనుమతితో ఈ నెల 17వ తేదీన లండన్ పయనం కానున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదని… ప్రతిపక్ష పార్టీలు జనసేన అలాగా తెలుగుదేశం పార్టీలు మొత్తుకున్నాయి. ఇప్పుడు బెయిల్ ఇస్తే… విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాగా విదేశాల్లోనే జగన్మోహన్ రెడ్డి సెటిల్ అవుతారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతాడని… ఇందులో భాగంగానే విదేశీ పర్యటన పేరుతో దేశం వదిలి పారిపోయేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని టార్గెట్ చేశారు ప్రతిపక్షాలు. ఇదే అంశాన్ని ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతిపక్ష పార్టీలు వాడుకున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన న్యాయబద్దంగా ఉండటంతో కోర్టు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.

ఇక ఇటు ఏపీలో వైసిపి పార్టీ మరోసారి విజయం ఖాయమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జూన్ 4వ తేదీ తర్వాత విశాఖలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తారని కూడా ముహూర్తం పెట్టారు బొత్స సత్యనారాయణ. జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడే ఉండి ఏపీని మరో ఐదేళ్లు జగన్ పరిపాలిస్తాడని తెలిపారు. ఇలా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?