NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Jagan : ఇక తప్పదు ‘ జగన్ కీలక వెనకడుగు ? ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించబోతున్నాడా ?

Jagan mohan reddy: ఏపిలో నిన్నటి వరకూ స్థానిక ఎన్నికల పంచాయతీ వ్యవహారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపి సీఎం వైఎస్ జగన్ అన్నట్లుగా సాగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఏకమై ఎన్నికలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నంలో రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం పైచేయి సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక తీర్పు నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఒక అడుగు వెనక్కు వేసినట్లే చెప్పుకోవాలి. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, కురసాల కన్నబాబు తదితరులు పేర్కొంటూనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై మరో సారి విరుచుకుపడ్డారు.

Jagan: No more key backlash? Going to announce the press meet?
Jagan No more key backlash Going to announce the press meet

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యనేతలు, అధికారులతో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించినట్లు సమాచారం. ఎస్ఈసీకి సహకరించడంపైనా కీలకం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా ప్రభుత్వాన్ని, ఉద్యోగ సంఘాలను తప్పుబడుతూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.  జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగాన్ని విచ్చిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన వ్యాక్సినేషన్ అంశాన్ని కోర్టు తప్పుబట్టింది. ఎన్నికలకు వ్యాక్సినేషన్ అడ్డంకి కానేకాదని అన్నది. ఉద్యోగ సంఘాలు చట్టవిరుద్దంగా వ్యవహారిస్తున్నారంటూ కోర్టు మండిపడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో ఉద్యోగ సంఘాలు ఎంటర్ కావడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అక్షింతలు వేసింది.

సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత ఎస్ఈసీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఆశ్రయించడం, సోమవారం నాటికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయకపోవడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయ్యింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాల్గవ దశగా మార్చింది.  దీనికి కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 21న నాల్గవ దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఇక రెండు, మూడు, నాల్గవ విడత ఎన్నికలను ఒకటి, రెండు, మూడు దశలుగా మారుస్తూ వాటిని యథాతధంగా జరపనున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మారిన షెడ్యుల్ ప్రకారం ఫిబ్రవరి ఏడున తొలి విడత ఎన్నిక, 13న రెండవ విడత, 17న మూడవ విడత, 21న నాల్గవ విడత  ఎన్నికలు జరగనున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju