NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Andra Pradesh : మూడు రాజధానుల వైపు జగన్ పయనం!

Andra Pradesh : మూడు రాజధానుల వైపు జగన్ పయనం!

Andra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ Andra Pradesh శాసన రాజధానిగా ఉండబోతున్న అమరావతిలో అన్నిరకాల ఏర్పాట్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం చక చకా చర్యలు తీసుకుంటోంది. అమరావతి లో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను పూర్తి చేయడానికి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులు కమిటీ ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

Andra Pradesh jagan run to three capitals
Andra Pradesh jagan run to three capitals

300 కోట్లు చాలు!

శాసన రాజధానిలో అవసరమైన భవనాలు ఏముండాలి? నిధుల అంచనా విషయంలో అధికారులు కమిటీ ఓ నివేదిక ప్రభుత్వానికి అందించింది . ప్రస్తుతం చాలా వరకు భవనాలను 70 శాతం దాటి నిర్మించారని, వాటిని పూర్తి చేయాలంటే మరో 300 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అధికారులు తేల్చారు. మొత్తం భవనాలు పూర్తి చేయాలంటే 2,154 కోట్లు అవసరమవుతాయని అయితే వాటిలో చాలా వరకు 70 శాతం పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు కమిటీ నివేదించింది. దీంతో 70 శాతం పైగా నిర్మాణాలు పూర్తయిన భవనాలను వెనువెంటనే పూర్తి చేయాలని సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు.

జమ్మూకాశ్మీర్, కర్ణాటక వాళ్లకు పయనం

ఇటీవల ప్రభుత్వ భవనాలను నిర్మించిన జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ఇటు కర్ణాటక రాష్ట్రానికి అధికారులు వెళ్లి అక్కడ ఎలాంటి భవనాలు నిర్మించారు? దానిలో ప్రమాణాలు పాటించాలనే అంశాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం త్వరలో ఆయా రాష్ట్రాల్లో పర్యటించనుంది. 70 శాతం కంటే తక్కువ స్థాయిలో పూర్తయిన భవనాలకు సంబంధించి రుణాలు విషయంలో మాట్లాడేందుకు త్వరలో బ్యాంకర్లతో ను అటు కాంట్రాక్టర్లతో నేను సైతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలోని కమిటీ భేటీ కానుంది. సమావేశం తర్వాత మిగిలిన భవనాల మీద స్పష్టత రానుంది. మిగిలిన భవనాలను పూర్తి చేయాలా లేక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రభుత్వం నుంచి బయట పడేలా అన్న విషయం మీద కూడా స్పష్టత రానుంది. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ చెబుతున్నారు.

శాసన రాజధానికి ఎంత మేర సరిపోతాయి?

అమరావతి పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనాల్లో కేవలం శాసన రాజధాని కీ ఎన్ని భవనాలు సరిపోతాయి అన్నది మరో రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదిత్యనాథ్ దాస్ సూచించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 288 ప్లాట్లు నిర్మాణం 74 శాతం, అఖిల భారత సర్వీసు అధికారులకు 144 ఫ్లాట్లు 74 శాతం పూర్తయ్యాయి. ఎన్జీవోల క్వార్టర్లలో 1968 ప్లాట్లు 62 రెండు శాతం, ఉన్నతాధికారులకు టైప్ 1 భవనాలు 338 ప్లాట్లు 58 శాతం, ఉన్నతాధికారులకు టైపు భవనాలు 336 ప్లాట్లు 64 శాతం, మంత్రులకు కేటాయించే 35 బంగళాలు, న్యాయమూర్తులకు కేటాయించే మరో 35 బంగళాలు 27శాతం మాత్రమే పూర్తయినట్లు కమిటీ తేల్చింది. సి ఎస్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ దీనిమీద భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలని నిర్ణయాన్ని త్వరలో తీసుకోనుంది.

 

author avatar
Comrade CHE

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju