ఫిబ్రవరి లో స్టార్ట్ అయ్యే స్కూల్స్ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ఫిబ్రవరి మాసం నుండి స్కూల్స్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో.. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జగన్ సూచించారు.

Jagan govt revises alcohol prices to curb liquor smuggling from Karnataka,  Telangana - The Daily Guardianఅంతేకాకుండా వచ్చే అకాడమిక్ ఇయర్ ఏడవ తరగతి నుండి ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి రాబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి మాసంలో స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు పిల్లలకు జగనన్న విద్యా కానుక అందరికీ అందుబాటులో ఉండే రీతిలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి వెంటనే ముగించాలని జగన్ విద్యాశాఖ అధికారులకు ఈ సమావేశంలో ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

 

అంతేకాకుండా పాఠశాల లకు పిల్లలు గైర్హాజరైతే మొదటిరోజు వాళ్ల తల్లిదండ్రులకు తర్వాత రోజు కూడా రాకపోతే సంబంధిత వాలంటీర్ వెళ్లి యోగక్షేమాలు తెలుసుకోవాలని గ్రామ సచివాలయ సిబ్బంది మరియు అధికారులు దీన్ని మోనిటర్ చేయాలని ఈ సమావేశంలో జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏది ఏమైనా పిల్లలు స్కూల్ కి వచ్చే రీతిగా తల్లిదండ్రులను ఒప్పించాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ అధికారులు తీసుకోవాలి అన్నట్టుగా, ఏ ఒక్క విద్యార్థి చదువుకు  దూరం కాకుండా చూసుకోవాలి అన్నట్టుగా ఈ సమావేశంలో జగన్ అధికారులకు సూచించినట్లు సమాచారం.