YS Jagan Delhi Tour: ఢిల్లీకి జగన్.. లేఖల ప్రభావమా..!? రఘురామ ప్రభావమా..!?

Share

YS Jagan Delhi Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.. రేపు ఉదయాన్నే ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లి.. అక్కడ కొందరు కేంద్ర మంత్రులను కలిసి సాయంత్రం అమిత్ షాతో కూడా భేటీ అవుతారు అనేది ప్రస్తుతానికి అందిన సమాచారం.. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం సాధారణమే.. కానీ ఈ సమయంలో వెళ్లడమే చర్చనీయాంశం.. ఓ వైపు వాక్సిన్ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా సీఎంలకు లేఖలు రాయడంపై బీజేపీ గుర్రుగా ఉందని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దలు సీరియస్ గా తీసుకున్న కారణంగానే జగన్ కి పిలుపు వచ్చిందని టాక్ వస్తుంది. సీఎం టూర్లు అన్నాక ఇలా రకరకాల టాకులు, పుకార్లు రావడం సహజమే.. కానీ ఉన్న పరిస్థితులు, చుట్టూ జరుగుతున్నా సంఘటనలు.. తాజా అంశాలు కొంచెం లోతుగా పరిశీలిస్తే ఏవి వాస్తవాలో.. ఏవి అవాస్తవాలో తెలుసుకునే వీలుంటుంది..

ఇది మాత్రం ఖాయం..! ఎందుకంటే..!?

ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణంరాజు విషయంలో సీరియస్ గా జగన్ ని పిలిపించేంత తీరిక.., అంత సీన్ ఢిల్లీ పెద్దలకు లేదు. అది వైసీపీ అంతర్గత వ్యవహారం.. జగన్ వ్యక్తిగత అంశం కూడా.. రఘురామ చాలా లోతుగా జగన్ ని, వైసిపిని కెలుకుతున్నారు.. కాబట్టి దీన్ని ఎలా డీల్ చేయాలో జగన్ కి బాగా తెలుసు. ఎవరూ చెప్తే వినేరకం కాదు.. ఈ విషయం కూడా బీజేపీ పెద్దలకు తెలుసు. పైగా వైసీపీ అవసరం బీజేపీకి చాలా ఉంది. ఈ సమయంలో రఘురామ విషయంలో చూసీ చూడనట్టు వెళ్లాలని.. ఆయనకు అనుకూలంగా బీజేపీ రాయబారం నడిపే అవకాశమే లేదు. అదే జరిగితే ఈ పిలుపులు, రాయబారాలు ఇప్పుడు కాదు, గత వారమే జరిగేవి..

వాక్సిన్ లో కీలక చర్చకు..!

వాక్సిన్ విషయంలో కేంద్రం ఒక అస్పష్ట వైఖరితో ఉంది.. ఇటు రాష్ట్రాలు కూడా గందరగోళంలో ఉన్నాయి. ఇది రాజకీయంగా కూడా రెండు వైపులా దెబ్బ తీస్తుంది. కరోనా రెండో దశ దేశాన్ని ఎలా పట్టి పీడిస్తుందో.., ఇటు బీజేపీ సహా కొన్ని రాజకీయ పార్టీల చేతగాని తనాన్ని కూడా బయటపెడుతోంది.. అందుకే వాక్సిన్ విషయంలో పక్క ప్రణాళికతో వ్యవహరించాలనేది కేంద్రం వ్యూహం. దీనిపై చర్చించే క్రమంలో జగన్ కి పిలుపు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ అంశానికి అమిత్ షాతో సంబంధం ఉండదు. అమిత్ షా అంటేనే బీజేపీకి రాజకీయ బిందువు. ఆయన ఎవరితో బేటే అయినా.. ఎవర్ని పిలిపించినా అందులో 90 శాతం రాజకీయ అంశాలే ఉంటాయి తప్ప పరిపాలన అంశాలు ఉండవు. అందుకే ఒకవేళ ఈ టూర్ లో జగన్ అమిత్ షాని కలిస్తే.. వీరిద్దరి మధ్య కొన్ని కీలక రాజకీయ అంశాలు చర్చకు వచ్చే వీలుంది. * జగన్ బెయిల్ రద్దు కోసమే సీబీఐ కోర్టులో పిటిషన్ విచారణ… * రఘురామా కేసులో సుప్రీమ్ లో కేంద్రం అఫడవిట్ దాఖలు చేయాల్సిన అంశము.. * పార్లమెంటుకి కేంద్రం తరపున నివేదిక.. ఈ మూడు కీలక అంశాలను కేంద్ర హోమ్ శాఖ తరపున చేయాల్సి ఉంది. అందుకే దీనికి అమిత్ షా పూర్తి బాధ్యులు. సో… దీనికి ముందు జగన్ తో చర్చిస్తే బాగుంటుందని కావచ్చు.. ఏ విషయం లోతుగా చెప్పుకోవాలంటే భేటీ ఎంత టైం జరిగింది..? ఏ సమయంలో జరిగిందో చూసుకుని మరింత లోతుగా వెళ్ళవచ్చు..!


Share

Related posts

ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ బిల్లు రేపు లోక్ సభకు

Siva Prasad

బైడెన్ కూడా ట్రంప్ లాగానే…? వచ్చీ రాగానే మహిళలకు అన్యాయం…!

siddhu

వారు ప్రపంచానికి ఎన్నో నేర్పారంటున్న పూరీ జగన్నాథ్..!

Teja