NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టులను పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి… అయితే ఇప్పుడు అలాంటి అడుగు వేయలేదు. తానే సింగిల్ గా పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నాడు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను… గుర్తించిన జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో సిట్టింగ్ స్థానాలు కూడా మార్చేశాడు.

ఇక ఇప్పుడు విశాఖలో మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఏపీ ప్రజలు తనకు అండగా ఉన్నారని… తన పాలన పట్ల ఏపీ ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో… విశాఖ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. విశాఖ రాజకీయ ఉంటుందని… అక్కడి నుంచి తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని కుండబద్దలు కొట్టి చెప్పారు జగన్మోహన్ రెడ్డి.

అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం వైసిపి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. యాక్ట్ కారణంగా భూమి లబ్ధిదారులకు జిరాక్స్ కాగితాలు మాత్రమే ఇస్తారని టిడిపి ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి… పేదల భూములు లాక్కొనే oదుకే ఈ కొత్త చట్టం తీసుకువచ్చాడని టిడిపి ప్రచారం చేస్తోంది. అయితే తాజాగా దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 9 లక్షలకు పైగా లబ్ధిదారులు ఒరిజినల్ పేపర్స్ తీసుకున్నారని… అందరికీ ఒరిజినల్ కాగితాలు ఇస్తామని తెలిపారు.

టిడిపి ప్రచారాన్ని నమ్మకూడదని వెల్లడించారు. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు… మరోసారి ఆయన ముఖ్యమంత్రి అవుతారా ? అనే దానిపై చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేశారు. అప్పు తెచ్చి అయినా సరే… అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి సక్సెస్ అయ్యారు. కానీ ఏపీలో పెట్టుబడులు ఆకర్షించడంలో విఫలమయ్యారు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతేకాకుండా నిరుద్యోగుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని చెబుతున్నారు. ఉద్యోగ కల్పన ఎక్కడ కనిపించలేదని అంటున్నారు. ప్రతిపక్షాలపై దాడులు తప్ప… ప్రజా పాలనా లేదని చెబుతున్నారు. ముఖ్యంగా అమరావతిని డెవలప్ చేయకుండా… మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొని… ఘోరంగా విఫలమయ్యాడని జనాలు కూడా అంటున్నారు. అదే అమరావతి రాజధానిని డెవలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి మార్కులు పడేవని చెబుతున్నారు. అయితే ఏపీ రైతులు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చుకోవడం గ్రౌండ్ స్థాయిలో చూస్తున్నాం.

రైతులకు ఎలాంటి నష్టం వచ్చిన ఈ ఐదు సంవత్సరాలలో వెంటనే స్పందించారు జగన్మోహన్ రెడ్డి. ఇలా జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనస్లు ఉన్నాయి అలాగే కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రజలు జగన్ వైపు ఉంటారా ? లేక కూటమి వైపు మల్లుతారా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N