NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: నాటి బాబు పాలన, నేటి మీ బిడ్డ పాలనను ప్రజలు బేరీజు వేసుకుని మద్దతు ఇవ్వాలని కోరిన సీఎం జగన్

Share

CM YS Jagan: గత చంద్రబాబు అయిదేళ్ల పాలన, నేటి మీ బిడ్డ 52 నెలల పాలనను ప్రజలు బేరీజు వేసుకుని మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తేనే మద్దతుగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబంలో మార్పు కనిపిస్తే.. అది మా జగనన్న పాలన, మనందరి పాలన అంటారని పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఈ 52 నెలల పాలనలో నిలబెట్టుకున్నానని స్పష్టం చేశారు సీఎం జగన్. వెనుకబడిన వర్గాల జీవన ప్రయాణంలో తోడుగా ఉన్నానని చెప్పారు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండ నేరుగా ఖాతాల్లో నిధులు వచ్చి చేరుతున్నాయన్నారు.

అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసిందని విమర్శించారు సీఎం జగన్. అప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. అప్పుడు, ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్డెట్ , మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే, చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు స్థలం ఇవ్వలేదన్నారు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ఇప్పటికే 22 లక్షల ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో సున్నీ వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారన్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేతోడు పథకం కింద లబ్దిదారులకు నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద వరుసగా నాలుగో ఏడాది అమలు చేస్తూ 3.25 లక్షల మందికి రూ.325 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతోందన్నారు. ఒక్క చేడోదు పథకం ద్వారానే రూ.1250 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. గతానికి ఇప్పటికీ పోలికలు చూడాలని విజ్ఞప్తి చేశారు. 52 నెలల కాలంలో అక్షరాలా రూ.2.38 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల  ఖాతాల్లోకి వెళ్తున్నాయన్నారు. ఎక్కడా లంచాలు, వివక్షత లేదన్నారు. చేదోడు, వాహన మిత్ర, ఇలా స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా ఉంటున్నామని వివరించారు.

ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడకుండా వారందరికీ సహాయం అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో 18 మెడికల్ కళాశాలు వచ్చాయన్నారు. మీ బిడ్డ నమ్ముకుంది కేవలం పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమేనని జగన్ అన్నారు. రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్దంలో తోడేళ్లన్నీ ఏకమవుతాయన్నారు. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని అన్నారు.

Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్ కు బదిలీ


Share

Related posts

Tollywood vs Bollywood : హిందీ చిత్రాలకి ఎదురెళుతున్న తెలుగు సినిమాలు..! ఆ నాలుగింటిలో విజయం ఎవరిది?

siddhu

కెన్యాలో ఉగ్రవాదుల దాడి – ఆరుగురు మృతి

somaraju sharma

విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం .. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు

somaraju sharma