విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అగ్రవర్ణాలకు కూడా..అర్హతలు ఇవీ

Share

విదేశాలలో విద్యను అభ్యసించే ఏపీ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో విధ్యను అభ్యసించే వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్ధుల కోసం జగనన్న విదేశీ విద్యా దీవెనపై ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వలు జారీ చేసింది. ఇకపై వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి రూ.8లక్షల లోపు ఆదాయం పొందే వారి పిల్లలు ఈ పథకాన్ని పొందవచ్చు. అయితే కొన్ని నిబంధనలు పేర్కొంది. క్యూఎస్ ర్యాంకింగ్ లో ప్రపంచంలోని మొదటి 100 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్ధులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుంది. 100 పైబడి 200 ర్యాంకింగ్స్ లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50లక్షల వరకూ ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించనున్నది.

 

ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ – 94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా ఫీజు రీయింబర్స్ మెంట్ ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. మొత్తం నాలుగు వాయిదాల్లో సెమిస్టర్ల ఫలితాలు రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ నగదు జమ చేస్తారు. 35 ఏళ్లలోపు ఉన్న వారు అందరూ ఈ పథకానికి అర్హులు. ఏపికి చెందిన వారై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ – డీసెంబర్ – జనవరి – మే మధ్య అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం నోటిపికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ చేత అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

 

గత ప్రభుత్వ హయాంలో రూ.6లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్న పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తించేది. విద్యార్ధుల సంఖ్యపై సీలింగ్, రూ.10 నుండి రూ.15 లక్షలు మాత్రమే ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ గా మంజూరు చేశారు. తాజాగా ప్రభుత్వం అగ్ర వర్ణాల వారితో పాటు విద్యార్ధుల పరిమితిని తీసేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ నగదును రూ.50లక్షల వరకూ పెంచింది ఈ సర్కార్. గత ప్రభుత్వం విదేశీ విద్యా దీవెనకు సంబంధించి 300 కోట్లకు పైగా బకాయి పెట్టింది.

బీజేపీ నేత సత్యకుమార్ గాలి తీసేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. మ్యాటర్ ఏమిటంటే..?


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

32 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

35 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago