NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Jai Bhim Bharat: ఏపిలో ఆవిర్భవించిన మరో కొత్త రాజకీయ పార్టీ

Jai Bhim Bharat: ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. బడుగు బలహీన వర్గాలను కలుపుకుని ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కొద్ది నెలల క్రితం సమావేశాలు నిర్వహించారు. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరో పక్క రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా నివారణకు ఉచితంగా మందు పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆనందయ్య కూడా బీసీల పార్టీల పెడుతున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశాల్లో వెల్లడించారు. ఆ సంఘ నేతలతో ఒకటి రెండు సార్లు సమావేశాలు నిర్వహించారు. కానీ ఈ పార్టీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే చాలా కాలంగా టీవీ టిబేట్ లలో పాల్గొనడంతో పాటు జై భమ్ యాక్సెస్ జస్టిస్ (జేఏజే) వ్యవస్థాపకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ ను నిర్వహించారు. అంబేద్కర్ జయంతి రోజు (ఏప్రిల్ 14న) రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని నెల రోజుల క్రితమే శ్రవణ్ కుమార్ చెప్పారు. చెప్పినట్లుగానే జై భీమ్ భారత్ పార్టీ ఆవిర్భావ సభ గురువారం విజయవాడలో నిర్వహించారు.

Jai Bhim Bharat party formation in ap
Jai Bhim Bharat party formation in ap

 

Jai Bhim Bharat: దళితుల కోసం పోరాడే పార్టీ లేదు

ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దళితుల కోసం పోరాడే పార్టీ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదన్నారు రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఉందన్నారు. తాను 28 సంవత్సరాలకే న్యాయమూర్తిని అయ్యాననీ, ఆ పదవిని పదేళ్లకే వదిలి వచ్చానని చెప్పారు. రూపాయికి కిలో బియ్యం ఇస్తూ ఆయిల్ ప్యాకెట్ రూ.200లకు విక్రయించే పార్టీలను పొగుడుదామా అని ప్రశ్నించారు శ్రావణ్ కుమార్. దళిత బిడ్డలకు మేన మామ అని చెప్పిన సీఎం జగన్ .. ఆ తర్వాత చేసిన అన్యాయం ఎవరూ మర్చిపోరని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ

వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీ పెడతామని తెలిపారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నిస్తానని తెలిపారు. 26 రకాల దళిత స్కీమ్ లను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు శ్రావణ్ కుమార్. విదేశీ విద్య కోసం వెళ్లే వారు ప్రభుత్వం నుండి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కన్షీరామ్ మాటల స్పూర్తితో ఈ రాజకీయ పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రితో సబ్ ప్లాన్ పై ఎక్కడైనా చర్చిస్తానని సవాల్ విసిరారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju