Janasena BJP: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో ఎన్నికలు ఏమి లేవు. కానీ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎన్నికల కదనరంగంలోకి దూకడానికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అయితే రాష్ట్రంలో చాలా బలంగా ఉన్న అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలం సరిపోయే పరిస్థితి లేదు. వైసీపీ, టీడీపీ, జనసేన – బీజేపీ త్రిముఖ పోరు జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికతో అది అధికార వైసీపీకి లాభం చేకూరుతుందన్న వాదన ఉంది. దీంతో అధికార వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడం కోసం టీడీపీ – జనసేన పొత్తుతో ముందుకు వెళ్లాలని ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓ అంచనాకు వచ్చారు. ఆ క్రమంలోనే పార్టీల క్యాడర్ ను సన్నద్దం చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారు, ప్రజల సంక్షేమం కోసం పొత్తులపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. పరోక్షంగా టీడీపీతో పొత్తుకు పవన్ సంకేతాలు ఇచ్చారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Read More: Pawan Kalyan: పొత్తులపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
Janasena BJP: సింహం సింగిల్ గా వస్తుందనేది సినిమా డైలాగ్ లే
ఇదే విధంగా టీడీపి అధినేత చంద్రబాబు కూడా సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర సంక్షేమం కోసం త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు అంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తుండగా, టీడీపీ తో జత కట్టేందుకు ఏపి బిజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ససేమిరా అంటున్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ – జనసేన పార్టీలేనని, వారి త్యాగాలు అవసరం లేదని పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. టీడీపీ – జనసేన పొత్తుల సంక్షేతాలపై వైసీపీ పెద్దలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ దమ్ము ఉంటే సింగిల్ గా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రియాక్ట్ అయ్యారు. జనసేన సింగిల్ గా పోటీ చేయాలని చెప్పడానికి వారికి (వైసిపి)కి ఏమి అధికారం ఉందని పవన్ ప్రశ్నిస్తున్నారు. సింహం సింగిల్ గా వస్తుందని అనేవి సినిమా డైలాగ్ లే కానీ రాజకీయాల్లో పనికి రావని, రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పొత్తు పొడుస్తుందా..?
అదే విధంగా చంద్రబాబు కూడా మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి టీఆర్ఎస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోలేదా, వైఎస్ఆర్ కంటే జగన్ గొప్పోడా..? అని ప్రశ్నించారు చంద్రబాబు. పొత్తులపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి సారి వైసీపీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రియాక్డ్ అవుతున్నారు. మళ్లీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకూడదు అన్న భావనలో పవన్ కళ్యాణ్ ఉంటే, అది టీడీపీికి అవకాశం కాకూడదన్న ఆలోచనలో సోము వీర్రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, సోము వీర్రాజుల భిన్న వాదనల నేపథ్యంలో జనసేన – బీజేపీ పొత్తు కొనసాగుతుందా..? టీడీపీ – జనసేన పొత్తు పొడుస్తుందా..? వీరి స్నేహం చిగురించకుండా ఉండేందుకు వైసీపీ కేంద్ర బీజేపీ స్థాయిలో ఏమైనా చక్రం తిప్పుతుందా..? అనేవి తెలుసుకోవాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.