Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Share

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు అని బీజేపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ తమకు సమదూరమని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పరోక్షంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పేరుకు పొత్తు అని చెబుతున్నా జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యక్రమాలు చేస్తున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలోనే జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూ
ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ మూడు ఆప్షన్ లలో బీజేపీని పక్కన పెట్టి ఒంటరిగా పోటీ చేయడం అని కూడా చెప్పారు.

Janasena Chief Pawan Kalyan contradiction Speech

 

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు భవిష్యత్తులో రావాలి అని అన్నారు. బీజేపీ యేమో పూర్తిగా మతతత్వ పార్టీ అనేది జనమెరిగిన సత్యం. హిందూత్వం అనే పునాదులపై బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీల పరస్పర విరుద్ధ భావాలు ఇక్కడ స్పష్టంగా అర్ధం అవుతోంది.  శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక వీర మహిళల రాజకీయ అవగాహన, పునః శ్చరణ తరగతుల తరగతులను ఆ పార్టీ నేత నాగబాబు ప్రారంభించగా, పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. కుల, మత ప్రస్తావన లేని ప్రభుత్వాలు రావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. జరుగుతున్న విధ్వంసాన్ని సరి చేస్తూ అభివృద్ధి చేయాలని అన్నారు. ఏ పార్టీ అయినా ప్రారంభంలో చిన్న గానే ఉంటుందనీ, ఇద్దరు ఎంపీల నుండి 303 మంది ఎంపీల వరకూ బీజేపీ పోరాటం చేసి ఏదిగిందన్నారు.

 

 

జనసేన కూడా అంతేనని అన్నారు. బీజేపీ ఈ స్థాయికి రావడానికి 20 ఏళ్లు పట్టిందన్నారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి అన్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సిద్దాంతాలు ఇప్పుడు పని చేయవని కొందరంటున్నారనీ, తనకు ఆశలు లేవు, ఆశయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. పార్టీలో మహిళలను చైతన్య వంతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపిలోని బీజేపీ నేతలు టీడీపీ, వైసీపీని విమర్శిస్తుండగా, పవన్ కళ్యాణ్ కేవలం అధికార వైసీపీ టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు. పవన్ ప్రసంగంలోనే సిద్దాంత వైరుద్యాలు వ్యక్తం కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. బీజేపీతో స్నేహం కొనసాగుతుందా లేదా అనేది తెలియాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే.

 


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

2 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

25 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago