NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. ఆ ఇద్దరు కీలక నేతలతో భేటీ..?

Breaking:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో పవన్ భేటీ కానున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. బీజేపీకి పవన్ కళ్యాణ్ దూరం జరుగుతున్నారని వార్తలు వినబడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కేంద్ర బీజేపీ పెద్దలతో భేటీ కానుండటం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఓ పక్క తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతుండగా, కొన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీకి సిద్దమవుతోంది. బీజేపీ ఎవరితో పొత్తు లేదని ఒంటరిగా పోటీ చేస్తుందని ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ బీజేపీ కేంద్ర పెద్దల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ విరమించుకున్నారు.

Pawan Kalyan

 

మరో పక్క ఏపిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం, టీడీపీ అదినేత చంద్రబాబుతో రెండు పర్యాయాలు సమావేశం కావడంతో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తాయని అందరూ అనుకుంటున్నారు. టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయనీ వైసీపీ విమర్శిస్తూనే ఉంది. ఆ రెండు పార్టీలు దమ్ముంటే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ సవాల్ కూడా విసురుతున్నారు. జనసేనలోని ఓ వర్గం మాత్రం టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేయాలని పవన్ పై ఒత్తిడి చేస్తుండగా, ఏపీ బీజేపీ నేతలు మాత్రం తమ పొత్తు జనసేనతోనే అని చెబుతున్నది. టీడీపీతో కలిసే ప్రసక్తిలేదని చెబుతోంది. ప్రస్తుత పరిస్థితిలో అధికార వైసీపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు అన్నీ కలవాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇందుకు బీజేపీ అంగీకరించడం లేదు.

గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మౌనం పాటిస్తూ ఉన్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు తమతో బాగుంటున్నా రాష్ట్ర నాయకత్వంతో సఖ్యత కొరవడిందని స్వయంగా పవన్ కళ్యాణ్ యే వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతున్నా జనసేన, బీజేపీ ఉమ్మడిగా కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఈ తరణంలో అమిత్ షా, జెపి నడ్డాలతో పవన్ కళ్యాణ్ భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపి, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. బీజేపీ పెద్దలతో పవన్ భేటీ అనంతరం ఎలా ముందుకు వెళ్లనున్నారు అనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

YSRCP: నేడు వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం .. నేతల్లో గుబులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju