Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పొత్తులపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది జనసేన – బీజేపీ ప్రభుత్వమా .. టీడీపీ – జనసేన – బీజేపీ ప్రభుత్వమా అనేది పొత్తులు నిర్ణయిస్తాయని, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి పదవికి సంసిద్దంగా ఉన్నానని ఎప్పుడో చెప్పాను, అయితే ప్రజల మద్దతు కూడా మాకు ఇచ్చే విధంగా ఉంటేనే సాధ్యమన్నారు. ఎన్నికల అయ్యాక ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందన్నారు. ఈ ప్రొసెస్ లో ఓటు చీలక ఉండకూడదు అన్నదే తమ ఉద్దేశమని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం నాయకత్వాన్ని బలోపేతం చేయడం మా ధ్యేయం అని పేర్కొన్నారు. తాను సున్నితంగా కనిపించవచ్చు కానీ ప్రజల కోసం వ్యక్తిగతం దూషణలను భరించడానికి సిద్దమని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో చేపట్టిన వారాహి మూడవ విడత యాత్ర ఈ రోజు విశాఖలో ముగిసింది. రెండు వారాహి బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ .. నాలుగు ఫీల్డ్ విజిట్స్ చేశారు. విశాఖలో భూములు అక్రమణలకు గురవుతున్నాయి.. అధికార పార్టీ నేతల అండతో కబ్జా చేస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక వారాహి యాత్ర ముగింపు సందర్భంగా ఇవేళ మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మూడో విడత వారాహి యాత్ర విజయవంతం అయ్యిందన్నారు. వైసీపీ పాలనలో ఏపీ నేరాలకు నిలయంగా మారిందని విమర్శించారు. చిత్తూరులో ఒకే రోజు చాలా మంది బాలికలు అదృశ్యమైయ్యారని అరోపించిన పవన్ .. దానిపై దర్యాప్తు చేయాలని కోరితే .. పోలీసులు ఏమీ జరగనట్లే మాట్లాడుతున్నారన్నారు. పోలీస్ స్టేషన్ వరకు రాకముందే చాలా పిటిషన్లు తన వద్దకు వస్తున్నాయన్నారు. పోలీసులను ప్రశ్నిస్తే తల్లిదండ్రుల పెంపకం లోపమని చెబుతున్నారని అన్నారు. బాధితులు పోలీసుల వద్దకు వెళితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం జరుగుతోందని, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా వెళ్తున్నాయని ఆరోపించారు. లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుతున్నారని అన్నారు. విశాఖలో 271 ఎకరాల్లో తవ్వకాలు జరిపి కడప సిమెంట్ ఫ్యాక్టరీకి తలిస్తున్నారని, ఖనిజాల తవ్వకాలతో పర్యావరణం తీవ్ర స్థాయిలో విధ్వంసం అవుతోందన్నారు. ఉత్తరాంధ్ర ను దోచేందుకే విశాఖ రాజధాని అంటూ సీఎం హడావుడి చేస్తున్నారని అన్నారు పవన్. 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వం అధ్బుతంగా పాలన చేసి ఉంటే తాను మాట్లాడే వాడిని కానన్నారు. వైసీపీతో ప్రభుత్వంతో పోల్చినప్పుడు టీడీపీ ప్రభుత్వమే బెటర్ అని అనిపించిందన్నారు. రాబోయే ప్రభుత్వంలో తప్పులు చేసిన వారినందరినీ బాధ్యులను చేయడం జరుగుతుందని పవన్ పేర్కొన్నారు.
Gannavaram: వైసీపీకి బైబై చెబుతూ కీలక వ్యాఖ్యలు చేసిన యార్లగడ్డ