Pawan Kalyan: ఏపిలో రాజకీయాలు ఇప్పుడే హీట్ ఎక్కుతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాడుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో మమేకం అవుతోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధపడుతున్నారనీ, 2023 (వచ్చే ఏడాది)లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలకు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు కార్యక్రమాలకు షెడ్యుల్ ఖరారు చేసుకున్నారు. మరో పక్క బీజేపీ కూడా సమావేశాలు నిర్వహిస్తొంది.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయ దశమి (అక్టోబర్ 5) నుండి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 5న తిరుపతి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. విజయ దశమి నుండి జిల్లా పర్యటనలకు పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని ఆ పార్టీ పిఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రతి నియోజకవర్గం ఉండేలా షెడ్యుల్ రూపొందిస్తున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు ఉంటాయని జనసైనికులు సిద్దంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఇప్పటి వరకూ అంగీకరించిన సినిమా షూటింగ్స్ ను అక్టోబర్ నాటికి పూర్తి చేసుకుని అప్పటి నుండి పూర్తి స్థాయిలో జనాల్లోనే ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లుగా తెలుస్తొంది. పవన్ పర్యటనపై జనసేన నేత, ఆయన సోదరుడు నాగబాబు కూడా స్పందించారు. తిరుపతి నుండి అక్టోబర్ న విప్లవం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
ప్రజా కోర్టులోనే ప్రభుత్వ వ్యతిరేకతను ఎత్తి చూపుతామని పేర్కొన్న నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్ విజయదశమి నుండి చేపట్టబోయే యాత్ర నభూతో న భవిష్యత్ అన్న రీతిలో సాగబోతుందని అన్నారు. ప్రజా క్షేమం, పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో అహర్నిశలు పని చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలను అధికార వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నా సీఎం జగన్ మదిలో ఏమున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో సంక్షమ పథకాలు యధావిధిగా కొనసాగుతున్న కారణంగా లబ్దిదారుల్లో ప్రభుత్వంపై సానుకూలతే ఉంది. కానీ ఇదే విధంగా మరో రెండేళ్ల పాటు ప్రతి నెలా అప్పులు చేస్తూ సంక్షేమ రధాన్ని పరుగులు పెట్టించడం ప్రభుత్వానికి కష్టతరమే. ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పుడే ఎన్నికలకు వెళితే ఉపయోగకరమన్న ధోరణిలో జగన్మోహనరెడ్డి ఉన్నారని వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణలో కేసిఆర్ గతంలో అవలంబించిన ఫార్మలానే ఇక్కడ జగన్ ఇంప్లిమెంట్ చేయనున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తారో లేదా ఆ జగన్నాధుడే తెలియాలి కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుండే యాక్టివ్ అవుతున్నాయి. చూడాలి ఏమిజరుగుతుందో..?
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…
ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన…