జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి విశేష స్పందన .. వందల సంఖ్యలో అర్జీలు

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి – జనసేన రెండో విడత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మంది క్యూకట్టారు. ఓ పక్క వర్షం కురుస్తున్నా వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. తమ సమస్యలను పవన్ కళ్యాణ్ కు విన్నవించి విజ్ఞప్తులు అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుండి సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపిలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పరంగా అయితే ఎన్నో సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. సీఎం సహాయ నిధి ఆరోగ్య శ్రీ లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతల దౌర్జన్యాలపై బాధితులు చెప్పిన విషయాలను తనను కలచివేశాయన్నారు.

 

అనేక వర్గాల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఇంత మంది వచ్చి తమ బాధలను ఎందుకు వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు. తదుపరి మీడియా సమావేశంలో వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ప్లీనరీలో సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగంలో ప్రతిపక్షాలను కౌరవులుగా పోల్చడంపై హస్యాస్పదంగా ఉందన్నారు.

ప్రధాని మోడీ.. బీజేపీ విధానాలపై మరో సారి ఘాటుగా విమర్శలు చేసిన తెలంగాణ సీఎం కేసిఆర్


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

35 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

44 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago