నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కౌలు రైతు కుటుంబాలకు లక్ష వంతున ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ అందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మండపేటలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత ఆర్ధిక స్వావలంబన సాధించేందుకు పది లక్షల రుణం ఇస్తామని ప్రకటించారు.అన్యాయం జరిగితే ప్రజలు ఎదురుతిరగాలని పవన్ పిలుపునిచ్చారు. శ్రీలంకలో బలమైన అధ్యక్ష కుటుంబం ప్రజల తిరుగుబాటుతో పరారయిన విషయాన్ని గుర్తు చేస్తూ జనం తిరగబడితే ఏ రాజకీయ నేత సరిపోడని అన్నారు. నాయకులకు టికెట్ ఇచ్చినా వారిని చూడకుండా వారిలో పవన్ కళ్యాణ్ ను ప్రజలు చూడాలన్నారు.

 

ఉభయ గోదావరి జిల్లా నుండి మార్పు మొదలయితే అది పులివెందుల వరకూ వెళుతుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడేది జనసేన మాత్రమేనన్నారు. జనసేన పార్టీని ఎందులో విలీనం చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలని అన్నారు. ఏపి భవిష్యత్తు కు వైసీపీ హనికరమని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులు గ్రామాలకే ఇస్తామని చెప్పారు. 2024 లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. తెలంగాణలో నా తెలంగాణ అన్న ప్రాంతీయ భావన ఉందనీ, ఆంధ్ర లో మాత్రం కులాలను గౌరవిస్తారని అన్నారు. అంబేద్కర్ కూడా తొలి సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని అన్నారు.

 

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తమ పార్టీ స్వాగతించిందనీ, కానీ దానిని కూడా వైసీపీ కుల రాజకీయం చేసిందని విమర్శించారు. జాతీయ రాజకీయ నేతలకు కులాలు అంటగట్టకూడదని ఈ వేదికగా తీర్మానం చేసుకుందామన్నారు. అక్టోబర్ నుండి ప్రజల్లోకి వస్తాననీ, అప్పుడే తాము ఏమి చేయబోతున్నామో చెబుతామని అన్నారు పవన్ కళ్యాణ్. గోదావరి వరదలలో బాధితులను జనసైనికులు ఆదుకోవాలని పవన్ కోరారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు హెలికాఫ్టర్ లోనే ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వమే కావాలా.. జనసేన కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.

బ్రేకింగ్: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్ ఖడ్


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

9 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

34 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago