NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తూర్పు కాపుల రిజర్వేషన్ లపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఏపిలో తూర్పు కాపుల రిజర్వేషన్ల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటం గ్రామ రైతులకు ఆదివారం ఆర్ధిక సాయం చెక్కులు అందించేందుకు గాను శనివారం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో సమావేశం అయ్యారు. కులం పేరు చెప్పుకుని నేతలుగా ఎదుగుతున్నారు గానీ ఆ కులం వారికి మాత్రం ఇబ్బందులు తొలగడం లేదని అన్నారు. తూర్పు కాపులకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మినహా ఇతర జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ల జారీ లో ఇబ్బందులపై చర్చించారు. తూర్పు కాపుల నుండి ఒక మంత్రి, ఒక ఎంపీ, అయిదుగురు ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నామని ప్రశ్నించారు.

Pawan Kalyan

 

తెలంగాణలో అక్కడి పరిస్థితులను బట్టి రిజర్వేషన్ స్టేటస్ తసేశారు అంటే ఒక అర్ధం ఉంది కానీ ఎక్కడ ఏపీలో తూర్పు కాపులకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే ఒబిసీగా గుర్తిస్తూ ఇతర జిల్లాల్లో ఆ స్టేటస్ ఇచ్చి గుర్తించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తొందని అన్నారు. ఉత్తరాంధ్ర నుండి తూర్పు కాపులు అన్ని జిల్లాలకు వలసలు వెళ్లారనీ, వారు ఎక్కడికి వెళ్లినా కులం మాత్రం మారదనీ, కానీ రాజకీయ ప్రాబల్యం ఉంటే తప్ప కుల సర్టిఫికెట్ వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

Pawan Kalyan

 

బీసీలు ఐక్యంగా ఉంటే రాష్ట్రాన్ని శాశించేది వాళ్లేనని పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ చైతన్యంతో… ఒకరిని ప్రాధేయపడే పరిస్థితి మార్చండని సూచించారు. కులానికో పదవి… రూ. 75 వేల జీతం ఇచ్చి నోరు మూయిస్తున్నారని ఆరోపించారు. కులంలో కొంత మంది చెంచాలు… కుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఘాటుగా విమర్శించారు. బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంత మంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి వస్తుందని హెచ్చరించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?