NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: జగన్ సర్కార్ పై మరో సారి ట్వీట్లతో విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్

Share

Pawan Kalyan:  జగన్ సర్కార్ పై వరుస ట్వీట్ లతో విరుచుకుపడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పాపం పసివాడు అంటూ మొన్న వ్యంగ్యంగా జగన్ పై విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ .. నిన్న రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు. బాధ్యులే బాధితుల్లా మాట్లాడుతున్నారేంటి ఆశ్చర్యపోతూ మరో ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా 2021 వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్ సమస్యలను తెరపైకి తీసుకువచ్చారు. అస్మదీయులకు ప్రాజెక్టు కట్టబెట్టినా నేటికి కూడా పనులు పూర్తి కాలేదని ఎద్దేవా చేస్తూ వరుస ట్వీట్లు పోస్టు చేశారు.

Pawan Kalyan

 

క్లాస్ వార్ అంటూ జగన్ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ సెటైర్ లు వేశారు. అధికారికంగా రూ.500 కోట్ల విలువైన ఏపీ సీఎం జగన్ నిరంతరం కార్ల్ మార్క్స్ లా క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని.. కార్ల్ మార్క్స్ లాగా వర్గ యుద్దం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు. అణచివేసే వారే .. అణచివేతకు గురైన వారిలా మాట్లాడటం విడ్డూరం అని .. నా కామెంట్స్ పై సందేహాలు ఉంటే, ఏపి మానవహక్కుల సంఘాలకు సంప్రదించండని కోరారు.

“19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే AP CM అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో , AP CM ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక” అని పేర్కొన్నారు.

అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మానం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు కానీ  దుర్ఘటన జరిగి ఈ రోజుతో 18 నెలలు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు” అని విమర్శించారు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటి కి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారన్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర జలవనురుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారన్నారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

YS Viveka Case: నేడు అవినాష్ రెడ్డి విచారణపై సర్వత్రా ఉత్కంఠ


Share

Related posts

KCR: కేసీఆర్ షాకింగ్ నిర్ణ‌యాలు… మ‌రో అధికారి బ‌దిలీలో కూడా అదే లెక్క‌

sridhar

Kuppam : కుప్పం తెలుగు తమ్ముళ్లు బాబును కోరిన దేమిటంటే?తప్పక తల ఊపారు కానీ అది జరిగే పనేనా?

Yandamuri

Job Notification : రైట్స్ లో ఖాళీలు..!!

bharani jella