NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena Tdp Alliance: జనసేన పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాలు ఇవే ..?

Janasena Tdp Alliance: రాష్ట్రంలో మరో ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చేస్తొంది. జనసేన – టీడీపీ పొత్తుతో పోటీ చేస్తాయంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నా ఆయా పార్టీల అధినేతలు నిన్న మున్నటి వరకూ క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంత సందిగ్దత నెలకొంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపైనా, సీఎం పదవిపై ఒక క్లారిటీ ఇచ్చేయడంతో సస్పెన్స్ కు తెరపడినట్లు అయ్యింది. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. టీడీపీతో కలిసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సుముఖంగా లేనట్లు స్పష్టమవుతోంది. ఆ విషయం పవన్ మాటల్లోనే వ్యక్తం అయ్యింది. బీజేపీని కూడా పొత్తుకు ఒప్పించే ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ పరోక్షంగా పేర్కొనడంతో ఆ పార్టీ సుముఖంగా లేదు అన్నది అర్ధం అవుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan

 

జనసేన – టీడీపీ పొత్తు ఖాయమన్నట్లు సంకేతాలు రావడంతో జనసేన ఏయే పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది.. టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్దం అవుతుంది అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో.. ఏయే నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది అని లెక్కలు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 130కిపైగా నియోజకవర్గాల్లో పోటీ చేయగా, దాదాపు 35 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అంటే 10 నుండి 20 శాతంకు పైగా ఓట్లు సాధించిన వాటిని జనసేన అడిగే అవకాశం ఉంది.

ఏయే నియోజకవర్గాల్లో జనసేనకు 10 శాతంపైగా ఓట్లు వచ్చాయనేది ఒక పరిశీలన చేస్తే.. గాజువాక, కాకినాడ రూరల్, అమలాపురం, రాజోలు, పాలకొల్లు, రాజమండ్రి రూరల్, భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పెద్దాపురం, కాకినాడ సిటీ, ముమ్మడివరం, కొత్తపేట, మండపేట, ఫిఠాపురం, తణుకు, పెడన, ఆవనిగడ్డ, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్,  గుంటూరు వెస్ట్,  భీమిలి. విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, యలమంచిలి, రామచంద్రాపురం, రాజనగరం, రాజమండ్రి సిటీ, నిడదవోలు, ఆచంట, ఏలూరు, మచిలీపట్నం, ప్రత్తిపాడు (గుంటూరు) నియోజకవర్గాల్లో పది నుండి 20 శాతంకుపైగా జనసేనకు ఓట్లు వచ్చాయి.

 

ఈ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను పొత్తులో భాగంగా జనసేన అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి జిల్లాలోనూ ఒకటి రెండు స్థానాలు పొత్తులో భాగంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే టీడీపీకి బలమైన నాయకత్వం, ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల విషయంలోనే జనసేన – టీడీపీ మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనీ, వాటిని  ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారనేది చూడాలి.

YS Viveka Case: వివేకా హత్య కేసులో లేఖపై సీబీఐ కీలక నిర్ణయం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju