NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

జనసేన కు దివిస్ దివిటి!! పవన్ పర్యటనతో పార్టీకి ఉపయోగమే!!

 

 

రాష్ట్రంలో కాపులు ఎక్కువగా ఉండే జిల్లా తూర్పుగోదావరి… రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 19 కలిగిన జిల్లా తూర్పుగోదావరి… రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా తూర్పు గోదావరి… చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కు అత్యధికంగా ఓట్లు రాబట్టిన జిల్లా తూర్పుగోదావరి… తూర్పుగోదావరి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే… ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్లు రకరకాల అంశాలు రాజకీయాలను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే తూర్పుగోదావరి రాజకీయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ జిల్లాలో ఎప్పుడు ఎవరి ప్రభావం పని చేస్తుంది? ఎలాంటి విషయం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తుంది వారిని ప్రభావితం చేస్తుంది అన్నది పట్టుకోవడం చాలా కష్టం…. అందుకే జిల్లా రాజకీయాలను అన్ని రాజకీయ పార్టీలు చాలా కీలకంగా తీసుకుంటాయి… ఈ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ శాతం ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ నే రాష్ట్ర వ్యాప్తంగా హవా చూపించి అధికారంలోకి వస్తుంది అనేది ఓ రాజకీయ సెంటిమెంట్… అలాంటి జిల్లాలో ఇప్పుడు పవన్కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ ఓ కొత్త ఉద్యమాన్ని రూపొందించే బాధ్యతను తీసుకుంది. పార్టీ నిర్మాణ పరంగా అంత బలంగా లేని జనసేనకు, తూర్పుగోదావరి రాజకీయాల్లో ఈ ఉద్యమం ఒక దివిటిగా ఉపయోగపడుతుందని, అత్యంత కీలకమైన ఈ జిల్లాలో ఇప్పుడు జనసేన పార్టీ తీసుకుంటున్న కీలకమైన స్టెప్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆ పార్టీకి ఓ దారి చూపిస్తుంది అనేది ఆ పార్టీ నేతల్లో ఆశ… అయితే ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమం తర్వాత రోజుల్లో ఎలా తయారవుతుంది అనేది దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే దానిపైనే జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా లాంటి పెద్ద జిల్లాలో ప్రభావం చూపేందుకు అవకాశం ఉంటుంది.

దివిస్ మీద బోలెడు అసంతృప్తి!!

**తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కోరంగి గ్రామంలో నిర్మితమవుతున్న దివిస్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మీద స్థానికంగా ఎంతో వ్యతిరేకత ఉంది. చంద్రబాబు హయాంలోనే కాకినాడ సెజ్ పరిధిలో దివిస్ కు అనుమతులు వచ్చాయి. సుమారు 300 ఎకరాలకు పైగా స్థలాన్ని దివీస్ దక్కించుకొని స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. మొదట ఇక్కడ కేవలం ఔషధాలకు సంబంధించిన ప్యాకింగ్ ఇతర పనులు మాత్రమే చేస్తామని చెప్పడంతో అప్పట్లో దీనికి ఎలాంటి గొడవలు జరగలేదు. అయితే ఫ్యాక్టరీ నిర్మాణం సమయంలో ఔషధాల తయారీ సైతం ఇక్కడ చేస్తామని చెప్పడంతో స్థానికులు ఆగ్రహజ్వాలలు రగిలాయి. దీంతో చంద్రబాబు హయాం నుంచే దీనిని స్థానికులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తమ ఆరోగ్యాలు తమ జీవితాలు పరిశ్రమ వల్ల పాడైపోతాయి అని వెంటనే దీని తరలించాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు. దీనికి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మద్దతు పలికారు. వెంటనే దివిస్ పరిశ్రమను తాము అధికారంలోకి వస్తే తరలిస్తామని ఆయన అక్కడ వారికి మాట ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పై అప్పట్లో నిప్పులు చెరిగారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం తోపాటు పరిశ్రమ నిర్మాణం వేగవంతం కావడంతో ఇటీవల స్థానిక గ్రామస్తులంతా పరిశ్రమ మీద దాడి చేసి ఫర్నిచర్ను తగలబెట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సుమారు 160 మంది వరకు వివిధ కేసులు పెట్టి జైల్లో వేశారు. ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా రగులుతున్న ఉద్యమం.

 

జనసేన వల్ల అవుతుందా??

**ఇది ప్రజా ఉద్యమం ముఖ్యంగా ప్రజల్లో నుంచి వారి వ్యతిరేకత నుంచి వచ్చిన ఉద్యమం. దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తమ మనుగడ కోసం సాగించే ఉద్యమంలో ప్రజలు దేనికైనా తెగిస్తారు ఎంతవరకైనా వెళ్తారు… అందులోనూ ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నప్పుడు అక్కడి వారికి ప్రత్యేకంగా మాట ఇచ్చి పరిశ్రమలు తరలించే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొన్ని రోజులుగా అక్కడి స్థానికులు కోరుతున్న పరిశ్రమ మీద దాడి చేసిన స్థానికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. సరిగ్గా ఇదే సమయంలో జనసేన పార్టీ నాయకులు ఈ ఉద్యమాన్ని తమ వైపు తిప్పుకున్నారు. జనసేన పార్టీలో నెంబర్ టు గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఎప్పటికీ దివిస్ పరిశ్రమ సమీప గ్రామాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు జైలులో ఉన్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. జిల్లాలో ఉన్న ఇతర జనసేన పార్టీ నాయకులు సైతం అప్పుడప్పుడు పరిశ్రమ బాధిత గ్రామాల వైపు వెళుతూ వారికి తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారు. గతంలోనే నాదెండ్ల మనోహర్ వచ్చినప్పుడు పది రోజుల్లోగా ఈ ప్రభుత్వం ఈ అంశంమీద ఎటూ తేల్చక పోతే ప్రత్యక్ష కార్యాచరణ లోకి జనసేన పవన్ కళ్యాణ్ దిగుతారని చెప్పుకొచ్చారు. అక్కడ వారికి హామీ ఇచ్చారు. దీని ప్రకారం ఇప్పుడు ఈ ఉద్యమాన్ని అక్కడి వారికి స్వాంతన చేకూర్చే ఎందుకు ఈ నెల 9వ తేదీన పవన్ కళ్యాణ్ దివీస్ బాధిత గ్రామాల్లో పర్యటించనున్నారు. దీనివల్ల కచ్చితంగా జనసేన పార్టీకి అత్యంత బలమైన జిల్లాలో రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి దివిటీ దొరికినట్లే.. అయితే ఇదే ఉద్యమాన్ని భవిష్యత్తులో ఎలా మలుచుకుంటూ ఉందనేది జిల్లావ్యాప్తంగా ఎలా మద్దతు సాధిస్తుంది అనేది చూడాలి. అందులోనూ ప్రజా ఉద్యమంగా ఉన్న దానిపై ఎలా విజయం సాధించి దానిమీద ఓట్ల విషయంలో రాబట్టుకుంటూటుందనేది పవన్ కళ్యాణ్ చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది.

author avatar
Comrade CHE

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju