Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రత్యర్ధులు విమర్శలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. మన పార్టీ – మన భాద్యత పేరుతో పార్టీ విరాళాలకు తెరలేపడం తెలిసిందే. ఎవరైనా సరే తమ జీతంలో ఒక్క రోజు వేతనం విరాళంగా ఇవ్వవచ్చు అని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కోరడం జరిగింది. అలాగే అభిమానులు, మద్దతుదారులు రూ.10ల నుండి ఎంతైనా విరాళం ఇవ్వవచ్చని ఆ పార్టీ ప్రధాన కార్యదర్సి నాగబాబు కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే జనసేన పార్టీపైనా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైసీపీ ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఒప్పుకోకపోతే 2014 ఎన్నికల్లో మాదిరిగా తాను ఎన్నికలకు సిద్దంగా లేనని ఎన్నికల బరి నుండి తప్పుకునే అవకాశం కూడా ఉందంటూ ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకూ పార్టీ నడపడం అంటే అంత ఈజీ కాదనీ, పార్టీని నడపాలంటే తాను సినిమాల్లో నటించకతప్పదని, సినిమాల్లో తాను తీసుకునే రిమ్యునరేషన్ తోనే పార్టీ నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆ మధ్య పేర్కొన్నారు. మద్యలో పార్టీకి నిధుల కోసం పారిశ్రామిక వేత్తలు, ప్రవాస ఆంధ్రులతో కూడా భేటీ అయ్యారు. ఇదే పని మీద నాగబాబు అండ్ టీమ్ విదేసాలకు వెళ్లి వచ్చారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు విరాళాల సేకరణకు పిలుపు ఇవ్వడంతో విరాళాలతోనే పవన్ పార్టీ నడపగలరా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుందని అంటున్నారు. సాధారణంగా పార్టీ నడపాలంటే అందుకు వేరే మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. గుప్త దాతలు, పారిశ్రామిక వేత్తల నుండి పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తేనే పార్టీ నిర్వహణ సాధ్యమవుతుంది. ఎన్నికల సమయంలో పార్టీ అధినేత టూర్ లకే విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పార్టీ గెలుస్తుంది అన్న నమ్మకం ఉంటేనే ఎవరైనా భారీగా విరాళాలు అందిస్తుంటారు. చిన్న మొత్తాల్లో వచ్చే విరాళాలు ఏమూలకు సరిపోవు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చే అభ్యర్ధుల నుండి, ఆశవహుల నుండి పెద్ద మొత్తంలో విరాళాలను రాజకీయ పార్టీలు సేకరిస్తుంటాయి. ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకే కాస్త ఎక్కువ తక్కువగా నిధులు సమకూరుతుంటాయి. అధికారంలోకి రాకపోయినా పదేళ్లకు పైగా రాజకీయ పార్టీని పవన్ నడుపుతున్నారు అంటే అది గొప్ప విషయమే. అయితే ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా తాను పార్టీని కొనసాగిస్తానని, ప్రజల్లోనే ఉంటానని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు.
అయితే ప్రస్తుతం పార్టీ నడిపేందుకు విరాళాల సేకరణకు అయితే పిలుపునిచ్చారు గానీ గడచిన పదేళ్లుగా పార్టీ నిధికి ఎంత మేర నిధులు జమ అయ్యాయి..? పార్టీ అధినేత పవన్ తన సినిమాల ద్వారా కేటాయించింది ఎంత..? కౌలు రైతు భరోసా కింద, ఇతరత్రా పార్టీ ఖర్చులు ఎంత పెట్టారు..? ఏ మేరకు పార్టీలో నిధులు ఉన్నాయి..? అనే విషయాలను పార్టీ ఇంత వరకూ ఎందుకు ప్రకటించలేదు అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో నిలిచినా జనసేన ఒక్క అభ్యర్ధి మాత్రమే గెలిచారు. పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత పవన్ బీజేపీతో జత కట్టారు. ఎన్డీఏ లో కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలో నిలవాలన్న ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే.
YS Sharmila: షర్మిలకి అప్పుడే మొదటి దెబ్బ కొట్టిన కాంగ్రెస్ ? వీళ్ళని నమ్మకూడదు బాబోయ్ !