NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Janasena Party – జనసేన – బీజేపీ బలవంతపు కాపురం ఎందుకో తెలుసా..!? పాపం పవన్..!!

Janasena Party : కొన్ని కాపురాలు బలవంతంగా చేయాల్సి వస్తోంది..! కొన్ని కాపురాలు అవసరం కోసం చేయాల్సి వస్తోంది..! ఇంకొన్ని కాపురాలు లాభం కోసం చేయాల్సి వస్తుంది..! ఏపి రాజకీయాల్లో జనసేన బీజేపి మధ్య జరగుతుతున్న కాపురం.. ఈ మూడు కోవలకు చెందుతుంది. ఒక పార్టీతో మరో పార్టీ బలవంతంగా కాపురం చేసుకుంటూ.. ఒక పార్టీ అవససర కోసం మరో పార్టీతో పొత్తు పెట్టుకుని, ఒక పార్టీ లాభం కోసం మరో పార్టీని వాడుకుని ఇలా “దొందూ దొందే”.. అనే ఆటను ఆడుతున్నాయి. మొత్తానికి ఏడు సంవత్సరాల క్రిందట పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అదే దశలో తన జనసేనను ఏడు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత కూడా అదే దశలో, అదే స్థాయిలో ఉంచారు అంటే క్షేత్ర స్థాయి పార్టీ నిర్మాణం జరగలేదంటే దానిలో పవన్ కల్యాణ్ స్వీయతప్పిదాలతో పాటు బీజెపీతో పొత్తు అంశం కూడా ఉంది. దీనిపై కొంచెం లోతుగా చర్చించుకోవాలంటే..

Janasena Party Pavan Kalyan bjp
Janasena Party Pavan Kalyan bjp

సైనికుల మాటలు వినపడుతున్నాయా..?

అవును..పార్టీ పెట్టి ఏడు సంవత్సరాలు అవుతోంది. పార్టీ కార్యవర్గం లేదు. విధి విధానాలు లేవు. సిద్ధాంతం లేదు. ఆరు నెలలకో మీటింగ్ పెట్టడం..అరగంట పాటు అరవడం, మూట ముల్లే సర్దుకుని హైదరాబాద్ వెళ్లి షూటింగ్ లు చేసుకోవడం, మళ్లీ వచ్చి ఏదో చిన్న పాటి టూర్ వేయడం. అక్కడికే పవన్ కళ్యాణ్ రాజకీయం పరిమితం అయ్యింది. కానీ జనసైనికులు మాత్రం మా సేనాని, మా పవన్, మా కల్యాణ్ అన్న
అనుకుంటూ గొంతులు చించుకుని అరవడానికి సిద్ధంగా ఉంటారు. నిండా పాతికేళ్లు కూడా లేని జనసైనికులు ఇప్పుడు అంతరమధనంతో చింతిస్తున్నారు. పవన్ పై అభిమానం చంపుకోలేక, పార్టీ కి పని చేయలేక, బీజేపీకి చాకిరి చేయలేక, బీజేపీ వేస్తున్న చీకటి దెబ్బలు చూస్తూ ఊరుకోలేక మధనపడుతున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనకే సీటు వస్తుందని ఆశించారు. అది రాకపోవడంతో తాజాగా బీజేపీ తీసుకున్న నిర్ణయంతో జనసైనికులు తమ అధినేతనే తప్పుపట్టే పరిస్థితి వరకూ చేరుకున్నారు. సైనికుల ఘోష కూడా అధినేతకు వినిపిస్తుందో లేదో..!!

Janasena Party Pavan Kalyan bjp
Janasena Party Pavan Kalyan bjp

Pavan kalyan : అవసరం..లాభం.. కష్టకాలం.. ఈ మూడే శాసిస్తున్నాయి

రాష్ట్రంలో బీజేపీ బలపడాలి అంటే ఏవరో ఒకరు ప్రజల్లో చరిష్మా ఉన్న నాయకుడు కావాలి. అటువంటి నాయకుడు పవన్ కల్యాణ్ రూపంలో బీజేపీకి దొరికాడు. పవన్ కల్యాణ్ కు అతిధిగా రాజకీయాలు చేయాలంటే తన ఖర్చులు గట్టెక్కాలంటే తనకు పలుకుబడి ఉంది అని నిరూపించుకోవాలంటే ఓ పెద్ద పార్టీతో పొత్తు కావాలి. అలా పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సరే..పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ.. పార్టీని విస్మరించాలని ఎక్కడా లేదు. కానీ పవన్ కల్యాణ్ చేస్తున్న తప్పు అదే. 2014కు ముందు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటికీ పార్టీ నిర్మాణం మీద, క్షేత్ర స్థాయి నిర్మాణం మీద దృష్టి పెట్టకుండా మొదట్లో టీడీపీ, బీజేపీతో కలిసి అడుగులు వేసి, ఆ తరువాత సీపీఎం, సిపీఐ, బిఎస్పీతో జతకట్టి మళ్లీ ఇప్పుడు బీజెపీతో కలిసి తన రాజకీయ అపరిపక్వతను తనే చాటుకుంటున్నారు. బీజేపీ అవసరం, ఇలా పవన్ కల్యాణ్ అవసరం కోసం ఈ రెండు పార్టీలు బలవంతంగా కలిసి నడుస్తున్నాయి.

Janasena Party Pavan Kalyan bjp
Janasena Party Pavan Kalyan bjp

Janasena Party : తిరుపతి ఉప ఎన్నికలో ఏవరి ఊపు ఎంత..?

సరే..ఇప్పటి వరకూ మొత్తం బాగానే ఉంది. తిరుపతి ఎంపి స్థానానికి జరుగుతున్న ఉప  ఎన్నికలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే కఛ్చితంగా లెక్కలు మారేవి. చిరంజీవి అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం, తిరుపతి లోక్ సభ పరిధిలో సుమారు పది  నుండి 15 శాతం కాపు సామాజిక వర్గ ఓట్లు ఉండటం, పవన్ కల్యాణ్ కు అంతో ఇంతో క్షేత్ర స్థాయి పట్టు అక్కడ ఉండటంతో జనసేన పోటీ చేస్తే కనీసం పది నుండి 15 శాతం అయినా ఓట్లు వచ్చేవి అనే నమ్మకం ఉండేది. కానీ ఏపిలో బీజేపీ అంటే రగులుతున్న వేళ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వక, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడని బీజేపీకి ఓట్లు వేసి ఏమి ఉపయోగం అని జనం ఆలోచిస్తున్న వేళ తిరుపతి ఎంపి స్థానాన్ని బీజేపీకి కేటాయించి జనసేన మరో సారి సేవకే పరిమితం అవుతుంటే సేనానికి ఏలా ఉందో కానీ సైనికులకు మాత్రం రగిలిపోతుంది. అందుకే సోషల్ మీడియాలో తమ అధినేత పవన్ కల్యాణ్ పైన దుమ్మెత్తిపోస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ పై తన అసంతృప్తిని బయటకు కక్కలేక కక్కలేక బయటపెట్టుకుంటున్నారు. మొన్న హైదరాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో బీజేపీ నిలబెట్టిన అభ్యర్థిని కాదని టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎంత బలవంతంగా, ఎంత అవసరం కోసం సాగుతుందో స్పష్టంగా చెప్పకోవచ్చు..!!

author avatar
Srinivas Manem

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju