Janasena: సంక్రాంతి తరువాత అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్..?

Share

Janasena: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. మరో రెండున్నరేళ్లకు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండి రాజకీయ పక్షాలు కరసత్తు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా రాజకీయ పక్షాలు వివిధ సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వెళ్లారు. బీజేపీ ఇటీవలే విజయవాడలో ప్రజాగ్రహ సభ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ పార్టీ నేతలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనకు సమాయత్తమవుతున్నారు.

Janasena Pawan kalyan ec meeting
Janasena Pawan kalyan ec meeting

 

మార్చి తరువాత రచ్చబండ, గ్రామ సచివాలయాల సందర్శన

మరో పక్క వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలో భాగంగానే గత నెలలో కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు జిల్లా పత్తిపాడులో పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గత రెండేళ్లుగా ఎక్కువ శాతం ప్రభుత్వ పథకాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండే ప్రారంభిస్తున్న సీఎం జగన్ ఇకపై జనాల సమక్షంలోనే కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ప్రతి నెలా రెండు మూడు జిల్లాల్లో కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారుట. మార్చి తరువాత రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అంటున్నారు. రచ్చబండ, గ్రామ సచివాలయాల సందర్శన, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. అంతే కాకుండా మంత్రివర్గ ప్రక్షాళన, పార్టీ ప్రక్షాళన కార్యక్రమాలు చేయనున్నారు.

 

Janasena:  9న ఈసీ మీటింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కూడా సంక్రాంతి పండుగ తరువాత ప్రజల్లో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఈ నెల 9వ తేదీన మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కార్యనిర్వహక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. పార్టీ కార్యక్రమాలను సమీక్షించి క్షేత్ర స్థాయిలో పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేస్తారని జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ తెలిపారు.

 

 


Share

Related posts

Bangarraaju : ‘బంగార్రాజు’ టార్గెట్ కూడా అదేనా..?

GRK

ఆ విషయం లో బాగా నెగ్గుకురావాలి అంటే ఆహారం లో దీన్ని తప్పక చేర్చుకోవాలి!!

Kumar

193 పరుగుల వద్ద ముగిసిన పుజారా ఇన్నింగ్స్

Siva Prasad