Janasena – Tdp: టీడీపీ – జనసేన పొత్తు..? ఇదే సాక్షం..!!

TDP - Janasena: Alliance Some Internal Secrets
Share

Janasena – Tdp: రాష్ట్రంలో జనసేన పార్టీ టీడీపీతో దోస్తాన్ కటీఫ్ చెప్పిన తరువాత బీజేపీతో చేయి కలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ఢిల్లీ బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన తరువాత పొత్తుకు బీజం వేశారు. రాష్ట్ర స్థాయిలో జనసేన బీజేపీ తో పొత్తు పెట్టుకున్న గ్రామీణ స్థాయిలో జనసేనకు ఎటువంటి ప్రయోజనం కనబడటం లేదు. క్షేత్ర స్థాయిలో బీజేపీ క్యాడర్ జనసేన కంటే తక్కువగా ఉండటంతో జనసేన కార్యకర్తలు బీజేపీతో కలిసి పని చేయడానికి అంతగా సముఖత చూపడంలేదు. అందుకే ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీడీపీ జనసేన అవగాహనతో పోటీకి దిగారు. టీడీపీ అధికారికంగా పోటీ నుండి విమరించుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు జనసేన అభ్యర్థులకు ఓట్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ – జనసేన పొత్తుతో బరిలో దిగినా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఈ క్రమంలో రెండు ఎంపీపీ స్థానాలు జనసేన మద్దతుతో టీడీపీ కైవశం చేసుకుంది. ఆచంట, వీరవాసరం ఎంపీపీ అధ్యక్షులుగా టీడీపీ నేతలు ఎన్నికైయ్యారు.

Janasena - Tdp forms local alliance for achanta veeravasram mpp elections
Janasena – Tdp forms local alliance for achanta veeravasram mpp elections

ఆచంటలో టీడీపీ ఏడు, జనసేన నాలుగు, వైసీపీ ఆరు ఎంపిటీసీ స్థానాలు గెలుచుకోగా జనసేన మద్దతుతో టీడీపీ ఎంపీపీ పదవిని తీసుకుంది. జనసేనకు మండల పరిషత్ ఉపాధ్య పదవితో పాటు కోఆప్షన్ పదవులు దక్కాయి. అదే విధంగా వీరవాసరంలో టీడీపీ తక్కువ స్థానాలు వచ్చినా జనసేన మద్దతుతో ఎంపీపీ పదవిని కైవశం చేసుకుంది. ఇక్కడ జనసేన ఎనిమిది, టీడీపీ నాలుగు, వైసీపీ ఏడు ఎంపిటీసీ స్థానాలు గెలుచుకోగా జనసేన మద్దతుతో టీడీపీకి చెందిన వీరవల్లి దుర్గా భవానీ ఎంపీపీగా ఎన్నికైయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీతో కలిసి ప్రయాణిస్తేనే జనసేనకు, జనసేన వల్ల టీడీపీ లాభపడతాయనే అభిప్రాయానికి వస్తున్నారు.


Share

Related posts

సంక్రాంతి బరిలో ఓటీటీ సినిమాలు కూడా వస్తే ఎట్టా ..?

GRK

YS Jagan – KCR: “దమ్మున్న” పత్రిక తెలంగాణాలో ఆ పని చేయగలదా?జగన్ కాదమ్మా.. అక్కడున్నది కేసీఆర్!! టచ్ చేసి చూడు!

Yandamuri

Venu sriram : వేణు శ్రీరామ్ మళ్ళీ అక్కడికే వచ్చాడా..?

GRK